Margaret Alva : బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ‘అల్వా’ ఫైర్
ప్రతిపక్షాల తీరుపై భగ్గుమన్న మార్గరెట్
Margaret Alva : భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగదీప్ ధన్ ఖర్ ను అభినందించారు ఓడి పోయిన మార్గరెట్ అల్వా. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు బీజేపీకి ఓటు వేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలకు, నిబద్దతకు రాజకీయాలు ప్రామాణికం కావాలన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా ఆమె ప్రతిపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కానీ ఊహించని రీతిలో బీజేపీ సంకీర్ణ సర్కార్ కు ఉన్న సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి.
దీనినే తప్పు పట్టారు మార్గరెట్ అల్వా. ఇదే సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వారికి, ఓట్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఆమె.
కాగా ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా అలాంటి పార్టీలు, నేతలు తమ విశ్వసనీయతను దెబ్బ తీశారంటూ నిప్పులు చెరిగారు.
ఈ ఎన్నికలు ముగిసినప్పటికీ రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం , పార్లమెంట్ గౌరవాన్ని పునరుద్ధరించడం కోసం తాను పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు మార్గరెట్ అల్వా(Margaret Alva).
ఇదిలా ఉండగా ఉమ్మడి ప్రతిపక్షాల స్ఫూర్తిని దయ, గౌరవంతో ప్రతిబింబిస్తున్నందుకు మార్గెరెట్ అల్వాకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా తన ప్రచారంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని అల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Also Read : భారత్ ను విశ్వ గురువుగా చేయాలి