Rajinikanth Governor : త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ తో త‌లైవా భేటీ

రాజ‌కీయాల గురించి చ‌ర్చించా

Rajinikanth Governor : త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్. ఎన్. ర‌వితో(Governor) మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు. సోమ‌వారం ఆయ‌న‌ను క‌లుసు కోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

71 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ న‌టుడు ఏది చేసినా సంచ‌ల‌న‌మే. 2017లో రాజ‌కీయాలలోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం పార్టీని ప్రారంభించాడు.

కానీ అంత‌లోనే తాను పార్టీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. దీంతో ఒక్క‌సారిగా అభిమానులు విస్తు పోయారు త‌లైవా చేసిన ప్ర‌క‌ట‌న‌తో. ఇవాళ చెన్నై లోని రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ ను ర‌జ‌నీకాంత్ క‌లిశారు.

స‌మావేశం అనంత‌రం త‌లైవా మీడియాతో మాట్లాడారు. గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యాన‌ని, ప్ర‌స్తుత రాజ‌కీయాల గురించి చ‌ర్చించాన‌ని చెప్పారు. అయితే లోప‌ట ఏమేం మాట్లాడుకున్నామ‌నే దాని గురించి బ‌య‌ట‌కు చెప్పలేన‌న్నారు ర‌జ‌నీకాంత్(Rajinikanth).

ఇది కేవ‌లం మ‌ర్యాద పూర్వ‌క‌మైన భేటీ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజ‌కీయం లేద‌న్నారు. 2021 త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు.

క‌రోనా, అనారోగ్య కార‌ణాల రీత్యా త‌ప్పుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు. రాజ‌కీయం, ప‌ద‌వులు, డ‌బ్బుల కంటే ఆరోగ్యం త‌న‌కు ముఖ్య‌మ‌ని చెప్పాడు. ఆపై కొంత కాలం అమెరికా వెళ్లాడు.

అక్క‌డి నుంచి త‌న ఇష్ట దైవాల‌ను ద‌ర్శించుకున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. కానీ ఉన్న‌ట్టుండి ఇవాళ గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌డం కొంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించేందుకు బీజేపీ ఆయ‌న‌ను త‌మ వైపు ఉండేలా చేస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : అనురాగ్ క‌శ్య‌ప్ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!