CWG 2022 India Finished : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా
మొత్తం 61 పతకాలతో 4వ స్థానం
CWG 2022 India Finished : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్ -2022(CWG 2022 India) ఎట్టకేలకు ముగిశాయి. ఎవరూ ఊహించని రీతిలో భారత దేశానికి చెందిన అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. భారతీయ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు మన క్రీడాకారులు శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
ఏకంగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లలో సత్తా చాటడంతో భారత దేశానికి 61 పతకాలు లభించాయి. మొత్తం దేశాల పరంగా లిస్టులో 4వ స్థానానికి చేరింది. తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ బాక్సింగ్ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.
ఇక ఏపీకి చెందిన పీవీ సింధు బ్యాడ్మింటన్ లో మొదటి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక కామన్వెల్త్ గేమ్స్(CWG 2022 India) లో మొదటి పతకాన్ని మీరా బాయి చాను సాధించింది.
ఆ తర్వాత పతకాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అత్యధికంగా భారత్ కు పతకాలు దక్కాయి. గాయం కారణంగా నీరజ్ చోప్రా హాజరు కాలేదు.
ఈ గేమ్స్ లలో దేశం తరపు నుంచి మొత్తం 216 మమది క్రీడాకారులతో బరిలోకి దిగింది. ఇక సాధించిన పతకాల పరంగా చూస్తే 22 బంగారు పతకాలు, 16 రజత పతకాలు, 23 కాంస్య పతకాలతో కలిపి 61 పతకాలు సాధించింది.
మొత్తంగా నాల్గో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. యావత్ భారతావని విజేతలను చూసి పొంగి పోయింది. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజేతలను అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు.
Also Read : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిక్లేర్