Krishnamachari Srikkanth : షమీ తప్పక ఉండాల్సిన ప్లేయర్
మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్
Krishnamachari Srikkanth : మాజీ భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పై మండిపడ్డాడు. సెలెక్టర్ల తీరును తప్పు పట్టాడు.
అద్భుతమైన ఫామ్ తో ఉన్న స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఎందుకు ఎంపిక చేయలేదంటూ ప్రశ్నించాడు. తాజాగా బీసీసీఐ యూఏఈలో ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.
ఇందులో షమీని పక్కన పెట్టింది. జట్టు కూర్పుపై శ్రీకాంత్ స్పందించాడు. ఇది పూర్తిగా అసంబద్దంగా ఉందని పేర్కొన్నాడు. ఒక వేళ తాను ఎంపిక చేయాల్సి వస్తే షమీ తప్పకుండా ఉండేవాడని స్పష్టం చేశాడు శ్రీకాంత్(Krishnamachari Srikkanth) .
ఇదిలా ఉండగా అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న విరాట్ కోహ్లీకి చాన్స్ ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఐపీఎల్ నుంచి సత్తా చాటుతూ వస్తున్న సంజూ శాంసన్ ను పక్కన పెట్టారు.
గాయం కారణంగా దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ కు చాన్స్ దక్కింది. ఇక బుమ్రా దూరమయ్యాడు. ఇదిలా ఉండగా సీమర్ షమీని పక్కన పెట్టడంపైనే స్పందించాడు శ్రీకాంత్.
షమీ చివరిసారిగా భారత్ తరపున టి20 ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు అతడి దూరంగా పెడుతూ వచ్చారు. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు కృష్ణమాచారి శ్రీకాంత్.
తాను గనుక సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉంటే బిష్ణోయ్ ఉండే వాడు కాదని షమీ ఉండేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Also Read : కోహ్లీకి చాన్స్ సంజూ శాంసన్ మిస్