Shehnaaz Gill : అదంతా అబద్దం ఆ మూవీలో నేనున్నా
స్పష్టం చేసిన నటి షెహనాజ్ గిల్
Shehnaaz Gill : ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీపావళి నుండి తాను నిష్క్రమిస్తున్నట్లు వస్తున్న పుకార్లను కొట్టి పారేసింది.
ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కూడా కీలక పాత్రలో నటించింది. ముంబైలో సల్మాన్ ఖాన్ తో హెహనాజ్ గిల్ ఫోటో కూడా దిగింది.
ఇదిలా ఉండగా ఈ మూవీపై ఎంతో నమ్మకంతో ఉన్నారు నటుడు. గిల్ తన ఇన్ స్టా గ్రామ్ లో సినిమాలో తాను నటించడం లేదని, నిష్క్రమించినట్లు వస్తున్న ప్రచారం అంతా అబద్దమంటూ స్పష్టం చేసింది.
గత కొంత కాలం నుంచీ తాను లేనట్టు వస్తున్న వార్తలన్నీ అబద్దమని పేర్కొంది. సినిమా కోసం సల్మాన్ ఖాన్ , పూజా హెగ్డేతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.
కాగా కభీ ఈద్ కభీ దీపావళి నిర్మాతలు షెహనాజ్ గిల్(Shehnaaz Gill) ను మరోక ప్రాజెక్టుకు సంతకం చేసిన తర్వాత సినిమా నుండి తప్పుకోవాలని కోరినట్లు సమాచారం.
కభీ ఈద్ కభీ దీపావళి ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుండి చాలా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ తన ఫస్ట్ లుక్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అందరినీ విస్తు పోయేలా చేశాడు.
నా కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నాడు ఖాన్. పూజా హెగ్డే తన షూటింగ్ ప్రకటనకు సంబంధించి ట్విస్ట్ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ బ్రాస్ లెట్ ధరించి లెన్స కు ఫోజులు ఇచ్చింది.
Also Read : అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్