David Warner : పీవీ సింధు ఆట తీరుకు వార్నర్ ఫిదా
అద్బుతంగా ఆడావంటూ ప్రశంస
David Warner : ప్రతిభ ఎక్కడున్నా వారిని ప్రోత్సహించడంలో, అభినందించడంలో ముందుంటాడు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్.
ఈ క్రికెటర్ కి తెలుగు వారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మనోడికి తెలుగు సినిమాలన్నా , ప్రత్యేకించి ఇక్కడి వారంటే, సంప్రదాయాలు, వంటలు అంటే భలే ఇష్టం.
తాజాగా కామన్వెల్త్ గేమ్స్ 2022లో తెలుగు తేజం స్టార్ షట్లర్ పీవీ సింధు మొదటిసారిగా బంగారు పతకాన్ని సాధించింది. వరుస సెట్లలో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది.
గతంలో కాంస్య, రజత పతకాలు సాధించిన సింధు తాజాగా పసిడి దక్కించుకుంది. ఈ సందర్బంగా స్టార్ షెట్లర్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు డేవిడ్ వార్నర్(David Warner).
ఆయనతో పాటు వార్నర్ భార్య క్యాండీస్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా సింధు ఆట తీరు అద్భుతమంటూ పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రముఖ క్రీడాకారిణులలో ఒకరుగా ఉన్నారు పీవీ సింధు. వరల్డ్ వైడ్ గా ఏడో ర్యాంకులో కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ లో తన తొలి వ్యక్తిగత కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
బాగా ఆడారు. అద్బుతమైన అచీవ్ మెంట్ కీప్ ఇట్ అప్ అంటూ సింధూ బంగారు పతకాన్ని ధరించిన ఫోటోతో పాటు ఇన్ స్టా గ్రామ్ లో డేవిడ్ వార్నర్(David Warner) రాశాడు.
ఈ పోస్ట్ పై వార్నర్ భార్య క్యాండీస్ కూడా స్పందించింది. చాలా బాగుందంటూ పేర్కొంది. కాగా వార్నర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : ఇకనైనా రన్ మెషీన్ రాణిస్తాడా