CAG Comment : ట్ర‌స్టుల నిర్వాకం సేవ పేరుతో మోసం

కాగ్ నివేదిక‌తో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి

CAG Comment : దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేదు. దేశంలో లెక్కించ‌న‌న్ని ట‌స్టులు, స్వ‌చ్చంధ సంస్థలు ఉన్నాయి. మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చాక వీటి నిర్వ‌హ‌ణ‌పై ఫోక‌స్ పెట్ట‌డం ప్రారంభించింది.

ఇక ప్ర‌తి ఏటా కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్ ) (CAG Comment) నివేదిక ఇవ్వ‌డం ప‌రిపాటి. ఊహించ‌ని రీతిలో బ‌డా బాబులు, కంపెనీలు, కార్పొరేట్ లు , ఆర్థిక నేర‌గాళ్లు, రాజ‌కీయ నేత‌లు, ఆశ్ర‌మాలు, పార్టీలు, మ‌ఠాలు, ఆస్ప‌త్రులు అన్నీ త‌మ కుటుంబీకులు లేదా బినామీలుగా ఎక్కువ 

శాతం ట్ర‌స్టులు, ఎన్జీఓల‌ను ఏర్పాటు చేసుకున్నాయి.

ఇక గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ హ‌యాంలో కీల‌కమైన నిర్ణ‌యాలు తీసుకుంది. ఒక‌టి స‌మాచార హ‌క్కు చ‌ట్టం రెండోది కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ని తీసుకు వ‌చ్చింది.

ప్ర‌తి ఏటా ఎవ‌రైనా వ్య‌క్తులు కానీ వ్య‌వ‌స్థ‌లు కానీ లేదా సంస్థ‌లు, కంపెనీలు త‌ము సంపాదించిన దాంట్లో ఆ సంవ‌త్స‌రంలో క‌నీసం 2 శాతం నిధుల‌ను లేదా రూపాయ‌ల‌ను స‌మాజ సేవకు, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

విచిత్రం ఏమిటంటే తెలంగాణ ప్ర‌భుత్వం ఇక్క‌డ తానే సీఎస్ఆర్ ను ఏర్పాటు చేసి ఆయా కంపెనీల నుంచి కొల్ల‌గొడుతోంది. ఇక ట్ర‌స్టులు, ఎన్జీఓలలో 10 శాతం మాత్ర‌మే సామాజిక సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యాయి.

మిగ‌తావ‌న్నీ తాము సంపాదించిన అక్ర‌మ డ‌బ్బులను ఆదాయ పన్ను మిన‌హాయింపు పొందేందుకు వీటిని ఆయుధంగా వాడుకుంటున్నారు.

ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. వీటిపై ఆదాయ ప‌న్ను శాఖ నియంత్ర‌ణ లేక పోవ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోందంటూ కాగ్(CAG Comment)  క‌డిగి పారేసింది. పార్ల‌మెంట్ సాక్షిగా స‌మ‌ర్పించిన నివేదిక‌లో సంచ‌ల‌న అంశాల‌ను ప్ర‌స్తావించింది.

దిమ్మ తిరిగి పోయేలా ఏకంగా దేశంలోని ట్ర‌స్టులు ఏకంగా రూ. 18,800 కోట్ల‌కు పైగా ప‌న్ను మిన‌హాయింపు పొందాయి. ఇన్ని కోట్ల‌ను దేని కోసం వాడారు. ఎందు కోసం వినియోగించారు.

ఎవ‌రి బొక్క‌ల్లోకి ఈ నిధులు వెళ్లాయ‌నేది తేలాల్సి ఉంది. అంతే కాదు స్వ‌చ్చంధ సంస్థ‌లు, ట్ర‌స్టుల ద్వారా వ‌చ్చిన విదేశీ విరాళాలు , వాటి

వినియోగంపై నిఘా పెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తో డేటా షేరింగ్ మెకానిజం లేక పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

35 అసెస్ మెంట్ కేసుల‌ను గుర్తించింది. విచిత్రం ఏమిటంటే ఎఫ్‌సీఆర్ఏ కింద రిజిస్ట్రేష‌న్ లేకుండానే విదేశీ విరాళాల‌ను స్వీక‌రించ‌డం గ‌మ‌నార్హం.

21 వేల ట్ర‌స్టుల‌కు కోట్లాది రూపాయ‌ల ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌డం మామూలు విష‌యం కాదు. 2014-15, 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రాల‌లో రూ. 18,800 కోట్ల రూపాయ‌లు ప‌న్ను మిన‌హాయంపు పొందాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది కాగ్.

అంతే కాకుండా 347 ట్ర‌స్టులు ఎఫ్‌సీఆర్ఏ న‌మోదు లేకుండానే విరాళాలు సేక‌రించ‌డం దారుణం. అత్య‌ధికంగా ఢిల్లీలో 1346 ట్ర‌స్టులు రూ. 4, 245 కోట్లు కొల్ల‌గొట్టాయి.

మ‌రాఠాలో 2, 500 కోట్లు , యూపీలో రూ. 1,800 కోట్లు , చండీగ‌డ్ లో 1600 కోట్లు మిన‌హాయింపు పొందాయి. క‌ర్ణాట‌క టాప్ లో ఉంది. రూ. 1,000 కోట్ల‌కు పైగా మిన‌హాయింపు పొంద‌డం విశేషం.

ఆ త‌ర్వాతి స్థానంలో ఏపీ, తెలంగాణ చేరాయి. ఏది ఏమైనా ఇక‌నైనా ఈ ట్ర‌స్టులు, ఎన్జీఓల ప‌నితీరుపై నిఘా పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

Also Read : ట్ర‌స్టుల నిర్వాకంపై కడిగేసిన కాగ్

Leave A Reply

Your Email Id will not be published!