Sunil Gavaskar : ఐపీఎల్ విమ‌ర్శ‌కుల‌పై స‌న్నీ సీరియ‌స్

ముందు మీ జ‌ట్ల గురించి ఆలోచించండి

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) షాకింగ్ కామెంట్స్ చేశాడు. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా నిర్వ‌హిస్తున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) పై ఇత‌ర దేశాలకు చెందిన క్రికెట‌ర్లు తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నారు.

ఐపీఎల్ వ‌ల్ల సంప్ర‌దాయ క్రికెట్ ఆట‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతోందంటున్నారు. దీంతో గ‌వాస్క‌ర్ ఐపీఎల్ విమ‌ర్శ‌కుల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు.

ఐపీఎల్ వ‌ల్ల ఆదాయంతో పాటు ఆద‌ర‌ణ‌కు నోచుకోని ఎంతో మంది యువ క్రికెట‌ర్ల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌ని పేర్కొన్నాడు. భార‌త్ కు చెందిన వారే కాకుండా ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్ల‌కు కూడా సూప‌ర్ చాన్స్ ద‌క్కుతోంద‌న్నాడు.

క‌రోడ్ ప‌తులు అయిన వారు కోకొల్ల‌లుగా ఉన్నార‌ని తెలిపాడు. ఆట‌ను ఆట‌గానే చూడాలి త‌ప్ప విమ‌ర్శ‌ల కోణంలో చూడ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికాడు గ‌వాస్కర్.

ముందు మీ దేశాల‌లో క్రికెట్ బోర్డులు ఏం చేస్తున్నాయ‌నే దానిపై ఫోక‌స్ పెట్టండి. మా దేశానికి సంబంధించిన బీసీసీఐలో (BCCI) వేలు పెట్ట‌కండి అంటూ మండిప‌డ్డారు.

మీ ఇల్లు చ‌క్కదిద్దు కోకుండా త‌మ‌పై ఏడిస్తే లాభం ఏమిటంటూ ప్ర‌శ్నించాడు స‌న్నీ. ఐపీఎల్(IPL) కార‌ణంగా చాలా మంది ఆట‌గాళ్లు దేశీవాళి ఆట‌ల‌కు గుడ్ బై చెబుతున్నారు.

మ‌రికొంద‌రైతే ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ లు ఆడేందుకు ఉత్సుక‌త చూపించ‌డం లేదు. దీంతో ఆయా క్రికెట్ బోర్డులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం స‌న్నీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో బాబ‌ర్ దే హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!