Vijay Sai Reddy : టెస్టు క్రికెట్ పై విజ‌య సాయి రెడ్డి ఆందోళ‌న

క‌నుమ‌రుగు కాకుండా చూడాల‌ని ఐసీసీకి సూచ‌న

Vijay Sai Reddy : వైఎస్పార్సీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి క్రికెట్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌కీయాలలోకి రాక ముందు నుంచీ విజ‌య సాయి రెడ్డికి క్రికెట్ అన్నా క్రీడ‌ల‌న్నా అమిత‌మైన ఆస‌క్తి. నిత్యం రాజ‌కీయాల‌తో బిజి బిజీగా ఉండే ఎంపీ ఉన్న‌ట్టుండి మ‌న‌సు క్రికెట్ మీద‌కు మ‌ళ్లింది.

క్రికెట్ గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రోజు రోజుకు టెస్టు క్రికెట్ కు జ‌నాద‌ర‌ణ త‌గ్గుతోంద‌న్న కార‌ణంతో దానిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డం లేద‌ని వాపోయారు.

ఈ మేర‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) , భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ)కి ప‌లు సూచ‌న‌లు చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి(Vijay Sai Reddy). క్రికెట్ లో మొద‌ట టెస్టు క్రికెట్ తో ప్రారంభ‌మైంది.

ఆ త‌ర్వాత వ‌న్డే ఫార్మాట్ , టి20 ఫార్మాట్ తో అల‌రారుతోంది. కానీ రాను రాను సాంప్ర‌దాయ క్రీడ‌గా భావించే టెస్టు క్రికెట్ కు రాను రాను ప్ర‌యారిటీ త‌గ్గుతోంద‌న్న భావ‌న అందరిలో క‌లుగుతోంది.

ఇదే విష‌యాన్ని ఎంపీగానే కాకుండా క్రికెట్ ను విప‌రీతంగా ప్రేమించే క్రీడాభిమానిగా విజ‌య సాయి రెడ్డి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అస‌లైన ఆట అనేది, ఆట‌గాళ్ల ప్ర‌తిభా పాట‌వాలు అనేవి టెస్టు మాధ్య‌మం ద్వారా తెలుస్తాయ‌ని పేర్కొన్నారు.

విచిత్రం ఏమిటంటే టి20 మోజులో ప‌డి బౌల్ట్ , డికాక్ లాంటి దిగ్గ‌జ స్టార్లు టెస్టుల‌కు దూరం కావ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు విజ‌య సాయి రెడ్డి.

సుదీర్ఘ ఫార్మాట్ ను నిర్ల‌క్ష్యం చేయ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐసీసీకి సూచించారు. టెస్ట్ క్రికెట్ ప‌ది కాలాల పాటు ఉండాల‌ని కోరారు.

Also Read : గంగూలీ ట్వీట్ క‌ల‌క‌లం స‌ర్వ‌త్రా ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!