Ross Taylor : క‌నిపించ‌ని జాత్యహంకారం నిజం – రాస్ టేల‌ర్

బ్లాక్ అండ్ వైట్ పుస్త‌కంలో కీల‌క వ్యాఖ్య‌లు

Ross Taylor : ప్ర‌పంచ వ్యాప్తంగా జాత్యహంకారంపై చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. త‌మ జాతి గొప్ప‌ద‌ని కాదు త‌మ‌దే గొప్ప‌ద‌న్న భావ‌న ప్ర‌తి చోటా కొన‌సాగుతూనే ఉన్న‌ది.

తాజాగా ప్ర‌ముఖ క్రికెట‌ర్ , న్యూజిలాండ్ ఐకాన్ గా పేరొందారు రాస్ టేల‌ర్. జాత్య‌హంకారంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. బ్లాక్ అండ్ వైట్ పేరుతో త‌న ఆత్మథ‌ను పుస్త‌కంగా విడుద‌ల చేశాడు గురువారం.

ఇందులో త‌ను క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ఎదుర్కొన్న అవ‌మానాలు, జాత్య‌హంకార సంఘ‌ట‌న గురించి స్ప‌ష్టం చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

రాస్ టేల‌ర్ రాసిన ఈ పుస్త‌కం క‌ల‌క‌లం రేపుతోంది. త‌ను ఆట ప‌రంగా కెరీర్ లో ఎదుర్కొన్న‌ ఇబ్బందుల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు రాస్ టేల‌ర్(Ross Taylor).

డ్రెస్సింగ్ రూమ్ ప‌రిహాసంలో, కొంత మంది సిబ్బంది , అధికారుల వ్యాఖ్య‌ల‌లో ఇది క‌నిపంచ‌కుండా ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంటార‌ని పేర్కొన్నాడు.

ఈ కామెంట్స్ అనేవి జాత్యహంకార దృక్ఫ‌థం నుండి రాలేద‌ని సున్నిత‌త్వం , సానుభూతి లేక పోవడం వ‌ల్ల వ‌చ్చినవ‌ని త‌న‌కు తెలుసు అని స్ప‌ష్టం చేశారు రాస్ టేల‌ర్.

తాను ఎన్నో ఇలాంటివి ఎదుర్కొన్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. న్యూజిలాండ్ లో క్రికెట్ చాలా తెల్ల‌ని క్రీడ‌. నా కెరీర్ లో చాలా వ‌ర‌కు నేను అసాధార‌ణంగా గోధుమ రంగులో ఉన్నాన‌ని పేర్కొన్నాడు రాస్ టేల‌ర్.

ఇది చాలా స‌వాళ్ల‌ను క‌లిగి ఉంది. వీటిలో చాలా వ‌ర‌కు క‌నిపించ‌కుండా కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నాడు. నాలాగా ఇత‌ర ఆట‌గాళ్లు కూడా ఇలాంటివి ఎదుర్కొంటార‌ని తెలిపాడు.

మొత్తంగా బ్లాక్ అండ్ వైట్ ఆత్మ క‌థ క‌ల‌క‌లం రేగుతోంది.

Also Read : హార్దిక్ పాండ్యాపై స్కాట్ స్టైరిస్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!