Shiv Sena Symbol : శివ‌సేన పార్టీకి 23 వ‌ర‌కు డెడ్ లైన్

ఉద్ద‌వ్ ఠాక్రే..ఏక్ నాథ్ షిండేకు ఈసీ స్ప‌ష్టం

Shiv Sena Symbol : శివ‌సేన పార్టీ ఎవ‌రిద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వంపై శివ‌సేన పార్టీ నుంచి తిరుగుబాటు ప్ర‌క‌టించిన ఏక్ నాథ్ షిండే సీఎంగా కొలువు తీరారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తుతో. కేబినెట్ కూడా పూర్త‌యింది. ఈ త‌రుణంలో అస‌లైన శివ‌సేన పార్టీ త‌మ‌దేనంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ మేర‌కు సీఈసీ డెడ్ లైన్ విధించింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేతో పాటు ఏక్ నాథ్ షిండే.

ఇద్ద‌రి పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టింది సీజేఐ జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాసనం. ఈ మేర‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఈసీకి. త‌దుప‌రి తీర్పు వెలువ‌రించేంత వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం శివ‌సేన పార్టీ విష‌యంలో తీసుకోవ‌ద్దంటూ ఆదేశించింది.

ఈ త‌రుణంలో మ‌రికొంత వెసులుబాటు ద‌క్కింది ఉద్ద‌వ్ ఠాక్రేకు. తాజాగా శివ‌సేన పార్టీకి(Shiv Sena Symbol) 15 రోజుల పాటు గ‌డువు ఇచ్చింది. ఈ మేర‌కు త‌మ పార్టీ నిజ‌మైన‌దంటూ  అందుకు సంబంధించిన ఆధారాలు స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది.

శాస‌న‌భ , శివ‌సేన సంస్థాగ‌త విభాగాల నుండి మ‌ద్ద‌తు లేఖ‌లు వ్రాత పూర్వ‌క ప్ర‌క‌ట‌న‌ల‌తో స‌హా ప‌త్రాల‌ను స‌మర్పించాల‌ని ఎన్నిక‌ల సంఘం రెండు వ‌ర్గాల‌ను కోరింది.

ఈ మేర‌కు ఆగ‌స్టు 23 లోగా ప‌త్రాలు స‌మ‌ర్పించేందుకు డెడ్ లైన్ విధించింది సీఈసీ. ఈ విష‌యంపై ఈసీ కేవ‌లం ప‌త్రాల‌ను మాత్ర‌మే కోరింద‌ని , విచార‌ణ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : రాబోయే రోజుల్లో మ‌రికొంద‌రికి షాక్

Leave A Reply

Your Email Id will not be published!