Rakesh Jhunjhunwala Comment : ‘ఝున్ ఝున్ వాలా’ అల్విదా

క‌ల‌ల‌కు రెక్క‌లు తొడిగిన వ్యాపార‌వేత్త‌

Rakesh Jhunjhunwala Comment : మ‌న చేతిలో ఓ అయిదు వేల రూపాయ‌లుంటే ఏం చేస్తాం. వెంట‌నే ఖ‌ర్చు చేస్తాం. కానీ చిన్న‌త‌నం నుంచే డ‌బ్బు విలువేంటో ఆయ‌న గ‌మ‌నించారు.

ఎవ‌రైనా పేరెంట్స్ పిల్ల‌ల్ని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తారు. కానీ ఆ పిల్లాడిని తండ్రి మాత్రం ఎంక‌రేజ్ చేయ‌లేదు. తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. ఆపై స్నేహితులు, కుటుంబీకులు ఎవ‌రూ కూడా నా కొడుక్కి ఒక్క పైసా కూడా ఇవ్వ‌కండి అంటూ హుకూం జారీ చేశాడు.

ఇంకొరైతే త‌న‌పై ఆంక్ష‌లు పెట్టి, అవమానించిన తండ్రి ప‌ట్ల కోపం పెంచుకుంటాం. లేదంటే ఇల్లు వ‌దిలి పారి పోతాం. లేదా ఎవ‌రి వ‌ద్ద‌నైనా అప్పులు చేస్తాం.

కానీ ఆ కుర్రాడు త‌న తండ్రి త‌న‌ను ఎందుకు అలా అన్నాడో ఆలోచించాడు. ఆపై తానే స్వంతంగా డ‌బ్బులు సంపాదించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.

కేవలం రూ. 5,000ల‌తో ఏకంగా రూ. 41,000 కోట్ల సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు. ఇంత‌కీ ఆ కుర్రాడి పేరే రాకేష్ ఝున్ ఝున్ వాలా.

ఒక మ‌నిషి ఇంత‌లా ఎద‌గ‌వ‌చ్చా అన్న దానికి ఆయ‌నే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. స్టాక్ మార్కెట్ అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది వారెన్ బ‌ఫెట్.

కానీ ఇండియాలో అంచెలంచెలుగా ఆ చేతిలో ఉన్న అయిదు వేల రూపాయ‌ల‌ను మెల మెల్ల‌గా కోట్లాది రూపాయ‌లు సంపాదించి పెట్టేలా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఝున్ ఝున్ వాలా.

హైద‌రాబాద్ లో పుట్టి ముంబైలో పెరిగిన రాకేష్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మార్కెట్ లోతుల్ని తెలుసుకున్నాడు. స్టాక్ మార్కెట్ అంటేనే జ‌డుసుకుని, భ‌యానికి లోన‌య్యే ఈ ప్ర‌స్తుత ప్రపంచంలో తాను విజేత‌గా నిలిచాడు.

ఏకంగా దానిపైనే ఫోక‌స్ పెట్టి రారాజుగా మారాడు రాకేష్ ఝున్ ఝున్ వాలా(Rakesh Jhunjhunwala). ఆయ‌న ఏది కొన్నా బంగారంగా మారింది. చాలా

క‌ష్టాలు ప‌డ్డాడు. విస్తృతంగా ప‌రిశోధించాడు.

ఎక్క‌డ పొదుపు చేయాలో, ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలో, ఏయే కంపెనీల‌లో షేర్లు కొనాలో తానే నిర్ణ‌యం తీసుకున్నాడు. ఊహించ‌ని రీత‌లో ఆ ఐదు వేలు ల‌క్ష‌ల‌య్యాయి.

ఆ తర్వాత ఇన్వెస్ట్ చేస్తూ..షేర్లు కొంటూ బిజీగా మారి పోయాడు. కోట్లుగా మారి పోయాయి. చివ‌ర‌కు భార‌త్ లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఇండియన్ వారెన్ బ‌ఫెట్ గా పేరు పొందాడు.

ఇది క‌ళ్ల ముందు చోటు చేసుకున్న చ‌రిత్ర‌. ఇవాళ ఆయ‌న లేక పోవ‌చ్చు. కానీ రాకేష్ ఝున్ ఝున్ వాలా విస్త‌రించిన సామ్రాజ్యం మామూలు కాదు.

ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేశాడు. చైర్మ‌న్ గా ఉన్నాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు. ఆపై ప్ర‌తి రంగంపై రాకేష్ కు ప‌ట్టుంది. కొన్ని చోట్ల పోగొట్టుకున్నా మ‌ళ్లీ పోయిన చోట‌నే తిరిగి తెచ్చుకున్నాడు.

త‌న‌ను తాను స్టాక్ మార్కెట్ కింగ్ మేక‌ర్ మారేలా చేసుకున్నాడు. కానీ ఏనాడూ అడ్డ‌దారులు తొక్క‌లేదు. వ్యాపార‌వేత్త‌కు విలువ‌లు ఉండాల‌ని న‌మ్మాడు.

ఏదో ఒక రోజు త‌న పేరుతో విమానాలు ప్ర‌పంచ‌మంత‌టా ప్ర‌యాణించాల‌ని అనుకున్నాడు. అందుకే ఆకాస ఎయిర్ లైన్స్ లో భాగ‌స్వామ్యం అయ్యాడు

ఝున్ ఝున్ వాలా.

క‌ల‌లకు రెక్క‌లు తొడిగి సామాన్యులు కూడా అసాధార‌ణ‌మైన విజేత‌లు కావ‌చ్చ‌ని నిరూపించాడు. దేశం వ్యాపార దిగ్గ‌జాన్ని కోల్పోయింది. అందుకే రాకేష్

ఝున్ ఝున్ వాలాకు అల్విదా చెప్ప‌డం త‌ప్ప ఇంకేం చేయ‌గ‌లం.

Also Read : రూ. 5 వేల‌తో రూ. 40 వేల కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!