Salman Butt Kohli : కోహ్లీ ఫామ్ లోకి వస్తే కష్టం – సల్మాన్ భట్
పాకిస్తాన్ ను హెచ్చరించిన మాజీ కెప్టెన్
Salman Butt Kohli : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక ఆడుతున్నాయి.
ఇక అన్ని జట్ల కంటే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రధానంగా ఆగస్టు 28న కీలక పోరు కొనసాగనుంది.
ఆరోజు కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. తాజా, మాజీ ఆటగాళ్లు తమకు తోచిన రీతిలో ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లపై స్పందిస్తున్నారు.
యూఏఈ వేదికపై 2021లో టి20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలైంది టీమిండియా. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఇందులో భాగంగా భారత జట్టు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎలాగైనా పరాజయానికి ప్రతీకారం తీర్చు కోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తూ సత్తా చాటుతోంది.
ఈ తరుణంలో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ భట్(Salman Butt). స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గత కొన్నేళ్లుగా పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు.
ప్రస్తుతం టోర్నీ పరంగా చూస్తే పాకిస్తాన్ హాట్ ఫెవరేట్ అని పేర్కొన్నాడు. కాక పోతే కోహ్లీ గనుక ఫామ్ లోకి వస్తే పాకిస్తాన్ కు చాలా కష్టమని హెచ్చరించాడు సల్మాన్ భట్.
Also Read : భారత్ కు షాక్ ఇవ్వడం ఖాయం