Salman Rushdie : సల్మాన్ రష్డీ దాడితో సంబంధం లేదు – ఇరాన్
మద్దతుదారులే దాడికి పాల్పడ్డారని ఆగ్రహం
Salman Rushdie : న్యూయార్క్ లో దాడికి గురై వెంటిలేటర్ పై కొన ఊపిరితో కొట్లాడుతున్నారు ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీ(Salman Rushdie) . దాడి జరిగాక ఇరాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
1989లో ఇరాన్ కు చెందిన మత గురువు ఆయతుల్లా ఖొమేనీ సల్మాన్ రష్డీపై ఫత్వా జారీ చేశారు. ఆయన రాసిన ది శాటనిక్ వర్సెస్ పుస్తకం.
ఇందులో ఇస్లాం మతం, మహ్మద్ ప్రవక్తపై తీవ్ర విమర్శలు చేశారంటూ ఆయన తలకు వెల కట్టారు. విచిత్రం ఏమిటంటే 33 ఏళ్ల తర్వాత సల్మాన్ రష్డీపై దాడికి గురి కావడం.
న్యూ జెర్సీకి చెందిన ఓ దుండగుడు న్యూయార్క్ లో ప్రసంగిస్తుండగా 75 ఏళ్ల రష్డీపై దాడికి పాల్పడ్డాడు. కాలేయం, చేతి నరాలు పూర్తిగా తెగి పోయాయి.
ఈ సందర్భంగా దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇరాన్ దేశం స్పందించింది. ఆయనపై జరిగిన దాడికి తాము బాధ్యత వహించమని స్పష్టం చేసింది.
రష్డీ మద్దతుదారులే కారణమంటూ ఆరోపించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాడి నుంచి మెల మెల్లగా కోలుకుంటున్నారు.
మతానికి వ్యతిరేకంగా రష్డీ చేసిన అవమానాలను సమర్థించమని పేర్కొంది. బారతీయ సంతతికి చెందిన రచయిత సల్మాన్ రష్డీ(Salman Rushdie) . 1988లో ఆయన నవలను రాశారు.
ఆనాట ఇనుంచి నేటి దాకా తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాసిన సల్మాన్ రష్డీతో పాటు పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణ కర్తలను కూడా చంపాలని పిలుపునిచ్చాడు మత ప్రవక్త. ఇరాన్ దేశం అతడి తలకు భారీ వెలను నిర్ణయించింది.
Also Read : భారత్ కు ఎవరి సర్టిఫికెట్ అక్కర్లేదు