Munugodu By Poll Comment : ఉప ఎన్నిక ఎవరి కోసం..?
ఎన్నికల సంఘం మరోసారి ఆలోచించాలి
Munugodu By Poll Comment : ఇవాళ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మునుగోడు మీదకు వెళ్లాయి. నిన్నటి దాకా ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి.
ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలని గులాబీ దళం ఉవ్విళ్లూరుతోంది. తాడో పేడో తేల్చుకుని జెండా ఎగుర వేసి సత్తా చాటాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ.
ఇక ఎంతో కాలంగా పట్టున్న తమకే విజయం దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇరు పార్టీలు జోరు పెంచాయి. జోష్ నింపే పనిలో పడ్డాయి. కానీ జనం మాత్రం అన్ని పార్టీలు వస్తే తమకు లాభం కలుగుతుందనే భావనలో ఉన్నారు. దేశంలో ఎన్నికలంటే ఒకప్పుడు గౌరవంగా చూసే వారు.
పోటీలో నిలబడిన వారి వ్యక్తిత్వం, రాజకీయ నేపథ్యం, సమాజంలో వారు చేస్తున్న ప్రజా సేవను చూసి గుర్తు పెట్టుకుని గెలిపించే వారు. కానీ నేడు సీన్ మారింది.
ఎవరు ఎన్ని కోట్లు కుమ్మరిస్తే వాళ్లే విజేతలుగా నిలిచే దౌర్భాగ్యకరమైన పరిస్థితి దాపురించింది. ఇటీవల తెలంగాణలోని హుజూరాబాద్ లో జరిగిన ఉప
ఎన్నికల్లో(Munugodu By Poll) రూ. 2 వేల కోట్లకు పైగానే అన్ని పార్టీలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది.
తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించు కునేందుకు స్వచ్చంధంగా రాజీనామా చేశారు. ప్రజా క్షేత్రంలోకి దిగారు.గెలుపొందారు ఈటల రాజేందర్.
కానీ మునుగోడు నియోజకవర్గానికి వచ్చే సరికల్లా అందుకు పూర్తిగా విరుద్దంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో స్పష్టంగా చెప్పలేక పోయారు.
తనకు నిధులు ఇవ్వలేదంటూ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమంతకు తాముగా తప్పుకోవడం వారి హక్కు కావచ్చు. కానీ ఏ కారణం లేకుండా పదవికి రాజీనామా చేయడం అనే విషయంపై పునరాలోచించాలి ఎన్నికైన వారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ
తీవ్రతను తెలియ చేసేందుకు ఆనాటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్(CM KCR) ఓ ఎత్తుగడగా భావించారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టారు. పవర్ లోకి వచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆంధ్రా, తెలంగాణ మధ్య ఏదో ఒక సమస్యను ముందుకు తీసుకు రావడంలో ఎక్స్ పర్ట్.
ఇక నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాలకు పుట్టినిల్లు. ఉద్యమాలకు కేరాఫ్. ఈ మొనుగోడులో కేవలం ఒక్కసారే టీఆర్ఎస్ గెలిచింది. మిగతా సార్లు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులే జెండా ఎగురవేశారు.
త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. హస్తం, కాషాయం, గులాబీదళంకు జీవన్మరణ సమస్యగా మారనున్నాయి. బీఎస్పీ, వైఎస్సార్సీపీ,
కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభావితం చూపనున్నాయి. ఎన్ని కోట్లయినా సరే గెలుస్తామంటున్నారు నేతలు బహిరంగంగానే
జనం సమస్యలు దారి మళ్లాయి, నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి. ఎందు కోసం రాజీనామా చేశారో నిలదీయనంత వరకు, తమ సమస్యలు పరిస్కారం ఎందుకు కాలేదోనని ప్రశ్నించనంత వరకు నేతలు ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ
విషయంపై మరోసారి ఆలోచించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉంది.
Also Read : డీజీపీపై బండి సీరియస్ కామెంట్స్