138 Judicial Appointments : నియామకాల్లో న్యాయ శాఖ రికార్డ్
వెల్లడించిన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ
138 Judicial Appointments : జస్టిస్ నూతలపాటి వెంకట రమణ కొలువు తీరిన సుప్రీంకోర్టు పరిధిలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది వరకు 138 న్యాయ నియామకాలు చేపట్టడం(138 Judicial Appointments) జరిగిందని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మౌలిక వసతులు కల్పించాలని , పేరుకు పోయిన కేసుల పరిష్కారానికి న్యాయ మూర్తులను నియమించాలని పదే పదే చెబుతూ వచ్చారు సీజేఐ ఎన్వీ రమణ.
ఆగస్టు 26న ఆయన సీజేఐ పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ యుయు లలిత్ కొలువు తీరనున్నారు.
ఆయన కూడా కేసుల పరిష్కారంపైనే ఎక్కువ ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు. రోజు రోజుకు పని భారం పెరుగుతోందని, సాధ్యమైనంత వరకు న్యాయమూర్తులను నియమించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజుకు విన్నవించారు సీజేఐ.
ఈ సందర్బంగా మంగళవారం కీలక ప్రకటన చేసింది కేంద్ర న్యాయ శాఖ. పంజాబ్ , హర్యానా హైకోర్టులలో ఆదివారం 11 మంది న్యాయమూర్తులను నియమించినట్లు వెల్లడించింది.
గతంలో 126 మందిని నియమించగా ఈ ఏడాది ఆ సంఖ్య 138కి చేరింది. ఇది న్యాయమంత్రిత్వ శాఖలో ఓ రికార్డు అని పేర్కొంది.
దేశంలోని వివిధ హైకోర్టులలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున న్యాయ నియామకాలు చేపట్టడం ఇదే మొదటిసారి అని స్పష్టం చేసింది. ఉన్నత న్యాయ వ్యవస్థలో మొత్తం నియామక ప్రక్రియ మరింత వేగవంతం చేయడం జరిగిందని తెలిపింది.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కొలువులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
Also Read : $4 బిలియన్ల స్టాక్ హోల్డింగ్స్ పై ఫోకస్