Arvind Kejriwal : సామాన్యుడి స్వరం కేజ్రీవాల్ సంతకం
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పుట్టిన రోజు ఇవాళ
Arvind Kejriwal : దేశ రాజకీయాలలో ఒక ప్రత్యేకతను కలిగిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇవాళ ఆయన పుట్టిన రోజు. కేజ్రీవాల్ కు 54 ఏళ్లు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గా, ఢిల్లీ సీఎంగా ఉన్నారు.
నిత్యం వార్తల్లో ఉంటూ సామాన్యుడే నా ఆయుధం అంటూ చెత్తను శుభ్రం చేసే చీపురునే తన పార్టీ జెండాగా పెట్టుకున్నారు. వైవిధ్యం కలిగిన
నాయకులలో అరవింద్ కేజ్రీవాల్ ఒకరు.
షీలా దీక్షిత్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో ఇబ్బందులు వాటన్నింటిని
తట్టుకుని ఆప్ ను విస్తరించే పనిలో పడ్డారు.
విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సంక్షేమం పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇవాళ దేశానికే ఆయన ప్రవేశ పెట్టిన విద్యా విధానం రోల్ మోడల్ గా నిలిచింది. మొహల్లా క్లినిక్ లు కూడా జనాదరణ పొందాయి.
ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివారు. భారతీయ సామాజిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా పేరొందారు కేజ్రీవాల్. హర్యానాలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. భారతీయ రెవిన్యూ సర్వీస్ లో కొంత కాలం పనిచేశారు
. జన్ లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి పని చేశారు. ఆపై సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది.
పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు చేసిన కృషికి గాను 2006లో రామన్ మెగసెసే పురస్కారం అందుకున్నారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు.
2013లో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో గెలుపొందారు. ఢిల్లీకి ఏడో సీఎంగా కొలువు తీరారు. అత్యంత పిన్న వయస్సు కలిగిన వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.
16 ఆగస్టు 1968లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ విస్తృతమైన అనుభవం కలిగిన నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేశాడు. ప్రజలకు పన్నులు, విద్యుత్, ఆహార పంపిణీ విషయాలపై అవగాహన కల్పించాడు. నకిలీ రేషన్
కార్డుల స్కాంను బట్ట బయలు చేశాడు కేజ్రీవాల్(Arvind Kejriwal).
మార్పు చిన్న చిన్న వాటితోనే ప్రారంభం అవుతుందని ఆయన నమ్ముతారు. రెండో సారి సీఎంగా ఎన్నికయ్యారు. మోదీ వ్యూహం పని చేయలేదు. షా పాచికలు పారలేదు.
బీజేపీ జిమ్మిక్కులు పని చేయలేదు. ప్రస్తుతం ఆయన మోదీ, బీజేపీ సర్కార్ తో పోరాడుతున్నారు. తన సారధ్యంలోనే పంజాబ్ లో ఆప్ ను పవర్ లోకి
తీసుకు వచ్చాడు. ఏది ఏమైనా భారత పాలిటిక్స్ లో చెరపలేని సంతకం కేజ్రీవాల్.
Also Read : నియామకాల్లో న్యాయ శాఖ రికార్డ్