Kejriwal Modi Comment : ఢిల్లీ బాద్ షా నువ్వా నేనా

ముదిరిన ఆప్ బీజేపీ వివాదం

Kejriwal Modi Comment : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Kejriwal)  మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. రెండోసారి దేశ రాజ‌ధాని ఢిల్లీలో సీఎంగా కొలువు తీరారు. సామాన్యుడిదే అధికారం అంటూ ఆప్ రెండోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.

అంతే కాదు రోజు రోజుకు ఆప్ విస్త‌రిస్తోంది. ఊహించ‌ని రీతిలో ఆప్ ఢిల్లీ నుంచి మొద‌లైన ప్ర‌స్థానం పంజాబ్ కు పాకింది. స్టార్ కమెడియ‌న్ గా గుర్తింపు

పొందిన భ‌గ‌వంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా ముందే ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి తెర తీశాడు అర‌వింద్ కేజ్రీవాల్.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. 92 సీట్లు సాధించి కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది ఆప్. ఈ త‌రుణంలో దేశంలోని వివిధ రాష్ట్రాల‌లో మ‌రింత ఫోక‌స్ పెట్టారు కేజ్రీవాల్.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌ధానంగా కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీతో(Modi) ఢీకొంటున్నారు. బీజేపీ శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నం చేసింది ఢిల్లీని కైవ‌సం చేసుకునేందుకు కానీ ప్ర‌ధాని పాచిక‌లు పార‌లేదు. ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా వ్యూహం ప‌ని చేయ‌లేదు.

బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి చ‌రిష్మా ఎందుకూ కొర‌గాకుండా పోయింది. ఆపై స‌ర్వ శ‌క్తులు ఒడ్డినా చివ‌ర‌కు ఆప్ కే ప‌ట్టం క‌ట్టారు సామాన్యులు.

దీంతో మెల మెల్ల‌గా కేజ్రీవాల్ స‌ర్కార్ ప‌వ‌ర్స్ లో కోత పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఈ మేర‌కు బిల్లు కూడా పాస్ చేయించింది బీజేపీ. ఇదే స‌మ‌యంలో

ఆప్ ప్ర‌భుత్వంపై క‌ర్ర పెత్త‌నం చెలాయించేందుకు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ను తీసుకు వ‌చ్చింది.

ఇక ప్ర‌తి దానికి కొర్రీలు పెట్ట‌డం , కేంద్రం జోక్యాన్ని ప్ర‌శ్నిస్తూ ఢిల్లీ స‌ర్కార్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను రంగంలోకి దించింది.

ఇప్ప‌టికే ఢిల్లీ ఆప్ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ ను అదుపులోకి తీసుకుంది ఈడీ. తాజాగా మ‌ద్యం పాల‌సీలో కుంభ‌కోణం జ‌రిగిందంటూ కేజ్రీవాల్

కు న‌మ్మిన బంటుగా పేరొందిన మ‌నీష్ సిసోడియాకు చెక్ పెట్టింది.

సిబీఐ 14 గంట‌ల పాటు విచారించింది. అత‌డితో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది. ఇదే స‌మ‌యంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా 12 మంది అధికారుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు.

వారిపై బ‌దిలీ వేటు వేశారు. తాము ఎలాంటి అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేదంటున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. ఇదిలా ఉండ‌గా దేశంలో రాబోయే

ఎన్నిక‌ల్లో బీజేపీ వ‌ర్సెస్ ఆప్ , మోదీ వ‌ర్సెస్ కేజ్రీవాల్(Kejriwal Modi) ఉంటుందంటున్నారు ఆప్ శ్రేణులు.

ఇది ప‌క్క‌న పెడితే విద్య‌, వైద్యం, మ‌హిళా భ‌ద్ర‌త‌, ఉపాధి, వ్య‌వ‌సాయం పై ఫోక‌స్ పెడుతూ ముందుకు సాగుతున్న అర‌వింద్ కేజ్రీవాల్. ఈ త‌రుణంలో

వ‌రుస దాడులు, సోదాల‌తో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు నిమ‌గ్నం అయ్యాయి.

రాబోయే రోజుల్లో కేంద్రం దూకుడు పెంచుతుందా లేక కేజ్రీవాల్ ను కూడా జైలులోకి తోస్తుందా అన్న‌ది వేచి చూడాలి. ఇక న్యాయం చెప్పాల్సిన

ధ‌ర్మ‌స్థ‌లం ఇప్పుడు మౌనంగా చూస్తోంది. మ‌రి కేజ్రీవాల్ వ‌ర్సెస్ మోదీ గా మార‌నుందా దేశ రాజ‌కీయం.

Also Read : కేజ్రీవాల్..యోగేంద్ర..సిసోడియాకు ఊర‌ట

Leave A Reply

Your Email Id will not be published!