Waqar Younis : షాహీన్ లేక పోవడం ఇండియాకు రిలీఫ్
పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్
Waqar Younis : పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్(Waqar Younis) షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగా ఈవెంట్ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. 28 నుంచి భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ టీంకు చెందిన స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది గాయపడడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
మోకాలి గాయం నుంచి కోలుకునేందుకు నాలుగు వారాల పాటు సమయం పడుతుందని జట్టు మేనేజ్ మెంట్ తెలిపింది. దీంతో వకార్ యూనిస్ కీలక కామెంట్స్ చేశారు.
దాయాదుల మధ్య పోరుపై ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. ఈ సందర్భంగా భారత జట్టుకు చెందిన బ్యాటర్లకు బిగ్ రిలీఫ్ కలిగినట్లయిందని పేర్కొన్నారు వకార్ యూనిస్.
భారత్ టాప్ ఆర్డర్ కు పెద్ద ఉపశమనమంటూ కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అఫ్రిది గాయంతో పాకిస్తాన్ షాక్ తగిలింది. భారత జట్టుకు ఒక రకంగా ఉపశమనం కలిగినట్లయిందని పేర్కొన్నాడు.
ఆదివారం షాహిన్ అఫ్రిది తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇదిలా ఉండా గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది.
10 వికెట్ల తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు షాహిన్ అఫ్రిది. ఒక రకంగా చెప్పాలంటే షాహీన్ కీలక సమయంలో తప్పుకోవడం బిగ్ లాస్ అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం షాహిన్ లాంటి కీలక పేసర్ లేక పోవడం ఇబ్బందికరంగా మారింది పాక్ జట్టుకు.
Also Read : ఆసియా కప్ కు శ్రీలంక జట్టు డిక్లేర్