Shubman Gill : శుభ్ మన్ గిల్ కు భలే చాన్స్
భారత్ - ఎ- జట్టుకు అతడే కెప్టెన్
Shubman Gill : జింబాబ్వే టూర్ లో సత్తా చాటుతున్న శుభ్ మన్ గిల్ కు అద్భుతమైన అవకాశం లభించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆదివారం స్వదేశంలో పర్యటించే న్యూజిలాండ్ -ఎ-తో జరగనున్న నాలుగు రోజుల మ్యాచ్ కు శుభ్ మన్ గిల్(Shubman Gill) కు కెప్టెన్ గా నియమించింది. ఇందులో ప్రకటించిన జట్టులో కీలకమైన అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే సెలెక్షన్ కమిటీ సంజూ శాంసన్ ను విస్మరించింది. అటు వికెట్ కీపర్ గా ఇటు బ్యాటర్ గా దుమ్ము రేపుతున్నా శాంసన్ నను పక్కన పెట్టడం కొంత విమర్శలకు తావిచ్చింది.
ఇక భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ తో భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 1న బెంగళూరు వేదికగా టూర్ ప్రారంభం కానుంది.
ఇక ప్రకటించిన భారత – ఎ – జట్టు ఇలా ఉంది. శుభ్ మన్ గిల్ కెప్టెన్ కాగా యశ్ దూబే, హనుమ విహారి, రజత్ పటీదార్ , సర్ఫరాజ్ ఖాన్ , వాషింగ్టన్ సుందర్ , కేఎస్ భరత్ (వికెట్ కీపర్ ) , ములానీ , జలజ్ సక్సేనా , శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్ , యశస్వి జైశ్వాల్ , శుభమ్ శర్మ, అక్షయ్ వాడ్కర్ , షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్ ఉన్నారు.
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు చెందిన హనుమ విహారీ, కేఎస్ భరత్, సిరాజ్ కు చోటు దక్కింది.
Also Read : షాహీన్ లేక పోవడం ఇండియాకు రిలీఫ్