Danish Kaneria : పాక్ ఫ్యాన్స్ పై డానిష్ కనేరియా ఫైర్
పాక్ క్రికెట్ బోర్డుపై మండిపాటు
Danish Kaneria : జింబాబ్వే టూర్ లో భాగంగా భారత జట్టు పేలవమైన ఆట తీరు ప్రదర్శించిందంటూ పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు ట్రోల్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇదిలా ఉండగా మూడు వన్డేల సీరీస్ లో 2-0తో భారత జట్టు ఆధిక్యంలో ఉంది.
మూడో వన్డే నామమాత్రంగా జరగనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 161 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది.
ఇక్కడే భారత్ ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎద్దేవా చేశారు. అదే మా పాకిస్తాన్ జట్టు అయితే ఎలాంటి వికెట్లు కోల్పోకుండానే ఛేదించి ఉండేదంటూ కొందరు పేర్కొన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించాడు పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఇదే సమయంలో భారత్ ప్లేస్ లో పాకిస్తాన్ గనుక ఉంటే 50 ఓవర్ల వరకు సాగ దీసి ఉండేదంటూ మండిపడ్డాడు.
ప్రత్యర్థి జట్టు 38.1 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. భారత జట్టు 25.4 ఓవర్లలో గెలుపు సాధించింది సీరీస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్ల ఆట తీరును ప్రశంసించాడు డానిష్ కనేరియా(Danish Kaneria).
ప్రధానంగా మంచి ఆట ఆడారంటూ కితాబు ఇచ్చాడు. ప్రత్యేకించి కేరళ స్టార్ సంజూ శాంసన్ ఆడిన విధానాన్ని ప్రస్తావించాడు. ఎక్కడా తొట్రు పాటుకు గురి కాకుండా క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడాడని తెలిపాడు.
ఇదే సమయంలో విపరీతంగా మ్యాచ్ లు ఆడించడం వల్లనే షాహీన్ అఫ్రిది గాయపడ్డాడంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఉతికి ఆరేశాడు.
Also Read : శుభ్ మన్ గిల్ కు భలే చాన్స్