Jhulan Goswami : మ‌హిళా అథ్లెట్ల పీరియ‌డ్స్ పై ఆలోచించాలి

క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి కామెంట్స్

Jhulan Goswami : ప్ర‌ముఖ భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి(Jhulan Goswami) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌లు నిత్యం ఎదుర్కొనే పీరియ‌డ్స్ (రుతుక్ర‌మం) గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

త‌న కెరీర్ లో మూడు ఫార్మాట్ ల‌లో 352 వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించింది. వ‌చ్చే నెల‌లో లార్డ్స్ వేదిక‌గా జ‌రిగే మూడో ఆఖ‌రి వ‌న్డేలో త‌న చివ‌రి కెరీర్ ను ముగించ‌నుంది.

ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు ఝుల‌న్ గోస్వామి. ఈ సంద‌ర్భంగా ఆదివారం ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రీడా రంగంలో పాల్గొంటున్న క్రికెట‌ర్ల‌తో పాటు ఇత‌ర క్రీడాకారులు, అథ్లెట్లుగా ఎవ‌రు ఉంటున్నారో వారి గురించి ఆయా క్రీడా సంస్థ‌లు ఆలోచించాల‌ని సూచించారు.

ఇందుకు సంబంధించి ప‌రిశోధ‌న‌లు కూడా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ఝుల‌న్ గోస్వామి. అంద‌రి మహిళ‌ల లాగానే తాను కూడా ప్ర‌తి నెలా పీరియ‌డ్స్ (రుతు క్ర‌మం) ప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చాలా సంద‌ర్భాల‌లో కోచ్ ల‌తో పంచు కోలేక నిశ్శ‌బ్దంగా పోరాడాన‌ని గుర్తు చేసుకున్నారు. పోటీ స‌మ‌యంలో పీరియ‌డ్స్ వ‌చ్చినప్పుడు మ‌హిళా అథ్లెట్లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను వివ‌రించేందుకు ప్ర‌య‌త్నించారు.

ప్ర‌ధానంగా అథ్లెట్ల‌పై రుతుస్రావం ప్ర‌భావాల‌ను అర్థం చేసుకునేందుకు శాస్త్రీయ ప‌రిశోధ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఝుల‌న్ గోస్వామి. డ‌బ్ల్యూవీ రామ‌న్ తో ఆమె త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

పీరియ‌డ్స్ స‌మ‌యంలో ఆడుతున్న‌ప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయి. వాటి గురించి ఆలోచించాల‌న్నారు.

Also Read : మా బంధం బ‌లీయ‌మైన‌ది – ధ‌న‌శ్రీ‌

Leave A Reply

Your Email Id will not be published!