Smita Sabharwal Comment : బిల్కిస్ కోసం ‘ధిక్కార’ స్వరం
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గ్రేట్
Smita Sabharwal Comment : స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిచయం అంతకన్నా అక్కర్లేదు. ఆమె సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన పోస్టులో కొలువుతీరారు.
గతంలో ఓ పత్రిక విషయంలో సంచలనంగా మారారు. అది పక్కన పెడితే ఇవాళ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసేలా నిలిచారు.
ఒక రకంగా దేశంలో సగభాగంగా ఉన్న మహిళల పట్ల రాను రాను దాడులు ఎక్కువై పోతున్నాయి. అత్యాచారాలకు అడ్డు లేకుండా పోతోంది. అడిగే నాథుడు కరువయ్యారు.
ఈ తరుణంలో 2002లో గోద్రా ఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న విషాదకరమైన, అత్యంత అవమానకరమైన సన్నివేశానికి , దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా ఉంది గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో(Bilkis Bano).
ఆమె కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిపై కోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2008లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఆనాటి ఘటనలో
బిల్కిస్ బానోను ఓ వర్గానికి చెందిన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రేప్ కు గురైన సమయంలో ఆమె 5 నెలల గర్భవతి. అంతే కాదు ఆమె కళ్ల ముందే చిన్నారితో పాటు కుటుంబీకులను కూడా దారుణ హత్యకు గురి చేశారు.
బాధితురాలు బిల్కిస్ బానో కోర్టును ఆశ్రయించింది తనకు న్యాయం కావాలని. మొత్తం 11 మంది దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు విధించింది.
పక్కా ఆధారాలు సమర్పించింది. ఎప్పుడైతే మోదీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరిందో ఇలాంటి వాళ్లకు బయటకు
వచ్చేందుకు యధేశ్చగా పర్మిషన్ ఇస్తూ వస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం గుజరాత్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం జీవిత ఖైదు విధించిన దోషులకు క్లీన్ చిట్ ఇచ్చి విడుదల చేసింది. బయటకు వచ్చిన వారికి పూలదండలు వేశారు.
స్వీట్లు పంపిణీ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దోషులను ఎలా విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అన్ని వర్గాలకు చెందిన వారంతా నిలదీశారు. ఇంకా ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి(PM Modi) పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
నారీ శక్తి లేక పోతే దేశం లేదన్నారు. కానీ అదే మహిళను సామూహిక అత్యాచారానికి పాల్పడి కోర్టు చేతిలో శిక్షకు గురైన వాళ్లను ఎలా వదిలి వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆ కోవలోకే చేరారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సబర్వాల్(Smita Sabharwal). ఆమె బేషరతుగా బిల్కిస్ బానోకు న్యాయం జరగాలని
కోరింది. అంతే కాదు దోషులకు వేయాల్సింది పూల దండలు కాదు ఉరి తాళ్లు వేయాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టంది. స్మితా సబర్వాల్ బిల్కిస్ బానో విషయంలో జరిగిన
అన్యాయం గురించి తాను సిగ్గుతో కుచించుకు పోయానని వాపోయారు.
ఒక బాధను వ్యక్తం చేసేందుకు. ఒక అన్యాయాన్ని ప్రశ్నించేందుకు హోదాలతో పనేంటి. ఏది ఏమైనా ఈ సందర్భంలో స్మితా సబర్వాల్ ను అభినందించి తీరాల్సిందే.
మిగతా వారు చేయని పనిని ఆమె చేసినందుకు. ప్రశ్నించినందుకు..నిలదీసినందుకు. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Also Read : పూల దండలు కాదు ఉరితాళ్లే కరెక్ట్