Rabbi Shergill : బిల్కిస్ బానోకు పంజాబ్ గాయ‌కుడి భ‌రోసా

మా చివ‌రి ర‌క్త‌పు బొట్టు దాకా కాపాడుకుంటాం

Rabbi Shergill : ఎవ‌రీ ర‌బ్బీ షెర్గిల్ అనుకుంటున్నారా. పంజాబ్ కు చెందిన ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన గాయ‌కుడు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు.

దేశ వ్యాప్తంగా 2002లో గుజ‌రాత్ లోని గోద్రాలో చోటు చేసుకున్న అల్ల‌ర్లు దేశ వ్యాప్తంగా సంచ‌లనం క‌లిగించాయి. ఈ ఘ‌ట‌న‌లో దేశం త‌ల దించుకునేలా బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచరంతో పాటు 5 ఏళ్ల చిన్నారి, కుటుంబీకుల‌ను దారుణంగా హ‌త్య చేశారు.

ఈ ఘ‌ట‌న కోట్లాది ప్ర‌జ‌ల‌ను క‌దిలించింది. 2008లో దోషుల‌కు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇదిలా ఉండ‌గా వారి ప్ర‌వ‌ర్త‌న బాగుందంటూ 11 మంది దోషుల‌ను గుజ‌రాత్ బీజేపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. దేశ వ్యాప్తంగా 6 వేల మందికి పైగా మ‌హిళ‌లు, మేధావులు, సంఘాలు సంయుక్తంగా భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికి లేఖ రాశారు.

దోషులను వెన‌క్కి ర‌ప్పించాల‌ని కోరారు. ఆనాడు అత్యాచారానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానోకు మ‌ద్ద‌తుగా పంజాబ్ గాయ‌కుడు ర‌బ్బీ షెర్గిల్ బిల్కిస్ పేరుతో పాట పాడాడు.

అది యావ‌త్ ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించింది. దేశ వ్యాప్త నిర‌స‌న‌ల మ‌ధ్య ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన వారి ప‌ట్ల క‌రుణ సందేశాన్ని పంపారు.

ఈ సంద‌ర్భంగా న్యాయ వ్య‌వ‌స్థ‌, రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను విడిచి పెట్ట‌డం బాధాక‌ర‌మ‌న్నారు ర‌బ్బీ షెర్గిల్(Rabbi Shergill) . నేను బిల్కిస్ కు చెప్పాల‌ని అనుకుంటున్నా. పంజాబ్ కు రండి.

మా చివ‌రి ర‌క్త‌పు బొట్టు దాకా మేము మిమ్మ‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని అన్నారు.

Also Read : బిల్కిస్ కోసం ‘ధిక్కార’ స్వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!