Justice UD Salvi : బిల్కిస్ దోషుల విడుద‌ల‌పై మాజీ జ‌డ్డీ ఫైర్

దోషుల‌కు శిక్ష విధించిన యుడి సాల్వి ఆగ్ర‌హం

Justice UD Salvi : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన గుజ‌రాత్ కు చెందిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో యావ‌జ్జీవ కారాగార శిక్షకు గురైన 11 మందిని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం పంధ్రాగ‌స్టు రోజు విడుద‌ల చేసింది.

బిల్కిస్ 5 నెల‌ల గ‌ర్భిణీ ఉన్న స‌మ‌యంలో సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. త‌న 5 ఏళ్ల కూతురుతో పాటు కుటుంబీకుల‌ను కూడా దారుణ హ‌త్య చేశారు.

త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై నిల‌దీసింద‌. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది బాధితురాలు బిల్కిస్ బానో(Bilkis Bano). ఈ కేసును విచారించి యావ‌జ్జీవ ఖైదు విధించిన ప్ర‌ధాన న్యాయమూర్తుల‌లో ఒక‌రైన జ‌డ్జి యుడి సాల్వీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

వారి విడుద‌ల‌ను ప్ర‌శ్నించారు. అత్యాచారానికి, హ‌త్య‌కు పాల్ప‌డిన వీరిని వ‌దిలి వేస్తే స‌మాజానికి మీరు ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నారంటూ ప్ర‌శ్నించారు.

దోషుల‌కు ఉరి తాళ్లు వేయాల్సింది పోయి స్వీట్లు, పూల దండ‌లతో ఎలా స్వాగ‌తం ప‌లుకుతారంటూ నిల‌దీశారు జస్టిస్ సాల్వి(Justice UD Salvi). విచిత్రం ఏమిటంటే పురుషులు మంచి సంస్కారం ఉన్న బ్రాహ్మ‌ణుల‌ని ఒక బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ఆ 11 మందిని విడుద‌ల చేయ‌డం త‌న‌ను నివ్వెర పోయాలే చేసింద‌న్నారు యుడీ సాల్వి. ఈ నిర్ణ‌యం ఎవ‌రు తీసుకున్నా దీనిపై పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు.

ఇదిలా ఉండ‌గా జ‌స్టిస్ యుడి సాల్వీ బాంబే హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వానికి ఉప‌శ‌మ‌నం ఇచ్చే అధికారం ఉంది. కానీ విడుద‌ల చేసే ముందు ఆలోచించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : నితిన్ గ‌డ్క‌రీ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!