YS Jagan : తెలుగు భాష‌కు ఆద్యుడు గిడుగు

కొనియాడిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

YS Jagan : తెలుగు భాష‌కు ప‌ట్టం క‌ట్టిన వ్య‌క్తి గిడుగు రామ్మూర్తి పంతులు అంటూ కొనియాడారు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan). ఇవాళ ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా గిడుగు చేసిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా స్మ‌రించుకు్నారు.

ఆనాటి ఆంగ్లేయుల కాలం నుంచి నేటి దాకా భాష ప‌ట్ల మ‌మ‌కారాన్ని క‌లిగి యుండాల‌ని, మాతృ భాష‌ను మ‌రిచి పోకూడ‌దంటూ ఉద్య‌మించార‌ని పేర్కొన్నారు.

గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి వ‌ల్ల‌, పోరాటం వ‌ల్ల ఇవాళ మ‌నమంతా ఇలా మాట్లాడు కోగ‌లుగుతున్నామ‌ని చెప్పారు. ఆయ‌న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అని, ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా తెలుగు భాషా దినోత్స‌వాన్ని జ‌రుపు కోవ‌డం రాష్ట్రానికి ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌శంసించారు.

మాతృ భాష‌ను గౌర‌విస్తూనే ఇత‌ర భాష‌ల‌ను నేర్చు కోవాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం. తెలుగు సాహిత్యాన్ని స‌ర‌ళీక‌ర‌ణ చేసిన మ‌హానుభావుడు అంటూ కొనియాడారు.

మ‌న భాష లోని తీయ‌ద‌నాన్ని, దాని ప్రాశ‌స్త్యాన్ని గురించి కూడా తెలియ చేసిన ఘ‌న‌త గిడుగు వారేనంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

కులీనుల్లో కొలువు తీరిన భాష‌ను సామాన్యుల‌కు చేరువ చేసిన మ‌హోన్న‌త సంస్క‌ర్త గిడుగు రామ్మూర్తి పంతులు(Gidugu Venkata Ramamurthy) అంటూ తెలిపారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం ట్విట్ట‌ర్ లో అధికారికంగా ఆయ‌నను గుర్తు చేసుకున్నారు.

త‌మ ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత భాష అభివృద్దికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. తెలుగు అకాడెమీ, తెలుగు అధికార భాషా సంఘాన్ని మ‌రింత పురోభివృద్ది చేసేలా నిధులు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు సీఎం.

Also Read : కేంద్రంపై పోరాడేందుకు కేసీఆరే స‌రైనోడు

 

Leave A Reply

Your Email Id will not be published!