Sidheeq Kappan : ఎవ‌రీ సిద్దిక్ క‌ప్ప‌న్..ఏమిటా క‌థ

ఎందుకు జైలు శిక్ష అత‌డికి

Sidheeq Kappan : మ‌రోసారి చ‌ర్చ‌కు దారి తీసింది జ‌ర్న‌లిస్ట్ సిద్దిక్ క‌ప్ప‌న్(Sidheeq Kappan). ఇత‌ను చేసిన నేరం సామూహిక ద‌ళిత యువ‌తి రేప్ గురై హ‌త్య‌కు గురైంది. దానిని నివేదించేందుకు యూపీకి వ‌స్తుండ‌గా హత్రాస్ వ‌ద్ద అత‌డిని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశ ద్రోహం చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఆపై ఆయ‌న‌ను జైలులో ఉంచారు. తాజాగా బెయిల్ పిటిష‌న్ కోసం చేసిన అభ్య‌ర్థ‌న‌పై సుప్రీంకోర్టు యూపీ స‌ర్కార్ కు నోటీసు జారీ చేసింది.

ఈ త‌రుణంలో యావ‌త్ ప్ర‌పంచ‌మంతా అత‌డిని విడుద‌ల చేయాల‌ని కోరాయి. వృత్తి రీత్యా పేష‌న్ ఉన్న పాత్రికేయుడు. కేర‌ళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సిద్దిక్ క‌ప్ప‌న్.

1980లో పుట్టాడు. త‌ప్పుడు నిర్బంధానికి ప్ర‌సిద్ది పొందాడు. భార్య రైహానాత్ క‌ప్ప‌న్. ముగ్గురు పిల్ల‌లు. అయితే సిద్దిక్ క‌ప్ప‌న్ చ‌ట్ట విరుద్ద‌మైన

కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద అభియోగాల‌కు గుర‌య్యాడు.

అక్టోబ‌ర్ 2020 నుండి జైలు లోనే ఉంటున్న ప్ర‌సిద్ద పాత్రికేయుడు. నలుగురు అగ్ర వ‌ర్ణాల‌కు చెందిన పురుషులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు 19 ఏళ్ల ద‌ళిత యువ‌తిపై.

ఇందుకు సంబంధించి క‌థ‌నాన్ని నివేదించేందుకు హ‌త్రాస్ కు కేర‌ళ నుంచి ప‌య‌న‌మ‌య్యాడు సిద్దిక్ క‌ప్ప‌న్. అతడు జైలుకు వెళ్ల‌క ముందు క‌ప్ప‌న్

న్యూస్ పోర్ట‌ల్ అజీముఖ‌మ్ కి రెగ్యుల‌ర్ కంట్రిబ్యూట‌ర్ గా ఉన్నాడు.

5 అక్టోబ‌ర్ 2020న మ‌రో ముగ్గురితో క‌లిసి హ‌త్రాస్ కు బ‌య‌లు దేరారు. మ‌థుర లోని టోల్ ప్లాజా వ‌ద్ద అత‌డి కారును ఆపారు. ప్ర‌యాణిస్తున్న న‌లుగురిని అరెస్ట్ చేశారు.

మ‌థుర కోర్టులో అత‌డిపై స‌మ‌ర్పించిన ఎఫ్ఐఆర్ లో 124ఏ (విద్రోహం), 153ఏ మ‌త ప్రాతిప‌దిక‌న వివిధ స‌మూహాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని ప్రోత్స‌హించ‌డం ,

295ఏ ఉద్దేశ పూర్వ‌కంగా హానిక‌ర‌మైన చ‌ర్య‌లు, మ‌త భావాల‌ను రెచ్చగొట్టేలా చేశారంటూ సిద్దిక్ క‌ప్ప‌న్ పై అభియోగాలు మోపారు.

యుపా చ‌ట్టాన్ని ప్ర‌యోగించారు. ఫిబ్ర‌వ‌రి 2021లో క‌ప్ప‌న్ అనారోగ్యంతో ఉన్న త‌న త‌ల్లి ఖ‌దీజా కుట్టిని సంద‌ర్శించేందుకు 5 రోజుల మ‌ధ్యంత‌ర బెయిల్ పొందాడు.

ఆ త‌ర్వాత ఆమె అనారోగ్యంతో జూన్ 2021న మ‌ర‌ణించింది. ఏప్రిల్ 2021లో క‌ప్ప‌న్ కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. జైలు ఆవ‌ర‌ణ‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కేఎం మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించ‌గా నెగ‌టివ్ అని చెప్పారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవ‌డంతో త‌దుప‌రి చికిత్స కోసం ఎయిమ్స్ కు త‌ర‌లించారు.

ఇదిలా ఉండ‌గా క‌ప్ప‌న్ ను జైలు నుండి విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ దేశంలో అనేక నిర‌స‌న‌లు త‌లెత్తాయి. అంత‌ర్జాతీయంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

Also Read : అరుదైన జ్ఞాప‌కం మోదీతో స్నేహం – ఆజాద్

Leave A Reply

Your Email Id will not be published!