Mukesh Ambani : దీపావ‌ళి నాటికి జియో 5జీ ధ‌మాకా – అంబానీ

ఖుష్ క‌బ‌ర్ చెప్పిన రిల‌య‌న్స్ చైర్మ‌న్

Mukesh Ambani : రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముఖేష్ అంబానీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు దేశ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న 5జీ సేవ‌ల గురించి వెల్ల‌డించారు.

వ‌చ్చే దీపావ‌ళి పండ‌గ నాటికి 5జీ స‌ర్వీస్ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు. తాము ప్ర‌తి ఒక్క‌రినీ మ‌రింత వేగంగా, నాణ్య‌వంతంగా క‌లిపేందుకు సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు.

అంద‌రికీ అందుబాటులో ఉండేలా, అంతా మెచ్చుకునేలా , సౌక‌ర్య‌వంతంగా ఉండేలా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌తో క‌నెక్ట్ చేస్తామ‌ని చెప్పారు. సోమ‌వారం ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు రిల‌య‌న్స్ సంస్థ‌ల చైర్మ‌న్.

జియో 5జీ ప్ర‌పంచంలోని అతి పెద్ద‌ది, అత్యంత అధునాత‌న‌మైన వ్య‌వ‌స్థ‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. డిజిట‌ల్ క‌నెక్టివిటీలో ప్ర‌ధానంగా ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ లో జియో సంచ‌ల‌నం సృష్టించింద‌న్నారు ఇప్ప‌టికే.

మ‌రో కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు ముఖేష్ అంబానీ(Mukesh Ambani). 5జీ సేవ‌ల‌తో తాము 100 మిలియ‌న్ల గృహాల‌ను అసమాన‌మైన డిజిట‌ల్ అనుభ‌వాలు, స్మార్ట్ హోమ్ సొల్యూష‌న్స్ తో అనుసంధానం చేస్తామ‌ని చెప్పారు.

భార‌త దేశ అవ‌స‌రాల‌ను తీర్చ‌డంతో పాటు గ్లోబ‌ల్ మార్కెట్ ల‌కు డిజిట‌ల్ సొల్యూష‌న్స్ ను అందించ గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు ముఖేష్ అంబానీ.

5జీ నెట్ వ‌ర్క్ కోసం తాము రూ. 2 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే డిసెంబ‌ర్ 2023 నాటికి భార‌త దేశంలోని ప్ర‌తి ప‌ట్ట‌ణానికి 5జీని విస్త‌రిస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ముఖేష్ అంబానీ.

Also Read : యువ రాణిని ప‌రిచ‌యం చేసిన అంబానీ

Leave A Reply

Your Email Id will not be published!