AR Rahman Street : కెన‌డా న‌గ‌రంలో వీధికి రెహ‌మాన్ పేరు

తాను ఊహించ లేద‌న్న సంగీత దిగ్గ‌జం

AR Rahman Street : అల్లా ర‌ఖా రెహ‌మాన్ అంటే కొంద‌రు మాత్ర‌మే గుర్తు ప‌డ‌తారు. కానీ ఏఆర్ రెహ‌మాన్ (AR Rahman) అంటే కోట్లాది మంది వెంట‌నే ఠ‌క్కున చెప్పేస్తారు. అంతలా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందాడు ఈ సంగీత దిగ్గ‌జం.

ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగ‌మంటూ ఏదీ లేదు. అతి చిన్న వ‌య‌స్సులోనే మోస్ట్ పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. భార‌త దేశంలో ఎంద‌రో కొత్త వారిని తీసుకు వ‌చ్చాడు.

వాళ్లంతా ఇవాళ అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన గాయ‌నీ గాయ‌కులుగా ఎదిగారు. పాన్ ఇండియా సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్న ఏఆర్ రెహ‌మాన్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది.

ఏకంగా ఆయ‌న పేరుతోనే కెన‌డా లోని ఓ స్ట్రీట్ (వీధికి) పేరు పెట్ట‌డం (AR Rahman Street) విశేషం. ఈ సంద‌ర్భంగా త‌న పేరు పెట్ట‌డంపై స్పందించాడు. ఇది త‌న జీవితంలో ఎన్న‌డూ ఊహించ లేద‌ని పేర్కొన్నాడు.

ఈ చిత్రాన్ని తాను షేర్ చేసుకున్నాడు. కెన‌డా లోని మార్క‌మ్ న‌గ‌రంలో ఇటీవ‌ల త‌న పేరు మీద ఒక వీధిని క‌లిగి ఉన్న గౌర‌వాన్ని పొందాన‌ని గ్రామీ విజేత అయిన రెహ‌మాన్ తెలిపాడు.

మీరు నా మీద‌, నా సంగీతం మీద ఉంచిన అభిమానానికి నేను ధ‌న్యుడిని. మీ ప్రేమ‌, వాత్స‌ల్యం ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నానని తెలిపాడు.

ప్ర‌స్తుతం అల్లా ర‌ఖా రెహ‌మాన్ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతోంది.

కెన‌డా లోని మార్క‌మ్ మేయ‌ర్ ఫ్రాంక్ స్కార్పిట్టి, కౌన్సెల‌ర్లు, ఇండియ‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ అపూర్వ శ్రీ‌వాస్త‌వ‌, ప్ర‌జ‌లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్.

ఏఆర్ రెహ‌మాన్ అనేది పేరు కాదు . దాని అర్థం ద‌యామ‌యుడు అని పేర్కొన్నాడు.

Also Read : హాట్ అండ్ లవ్లీ ఫోజులతో హాట్ లుక్స్ ఇచ్చిన ఈషా

Leave A Reply

Your Email Id will not be published!