Micky Arthur : హార్దిక్ పాండ్యా రాకెట్ లాంటోడు – పాక్ కోచ్
అతడు ఒక్కడు 11 మంది ఆటగాళ్ల బలం
Micky Arthur : యూఏఈ వేదికగా కొనసాగుతోంది ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ 2022(Asia Cup 2022). సెప్టెంబర్ 17 దాకా ఈ టోర్నీ జరుగుతుంది. ప్రస్తుతం జట్లు ఎన్ని ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం పాకిస్తాన్ , భారత్ జట్లకు సంబంధించి చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి.
గత ఏడాది 2021లో ఇదే వేదికపై జరిటిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో ఇదే వేదికగా ఆగస్టు 28న జరిగిన దాయాదుల పోరులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
5 వికెట్ల తేడాతో అదరగొట్టింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. ఈ కీలక మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటాడు.
ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి బౌలర్ చేతన్ శర్మ నేటి బీసీసీఐ సెలెక్టర్ బౌలింగ్ లో పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావెద్ మియందాద్ కొట్టిన సిక్సర్ ను తలపింప చేసింది పాండ్యా ఆడిన షాట్.
ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. బౌలింగ్ లో 3 వికెట్లు , 33 కీలక పరుగులు చేసి పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.
పాకిస్తాన్ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్(Micky Arthur) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాండ్యా మామూలోడు కాదని రాకెట్ లాంటోడన్నాని కితాబు ఇచ్చాడు. అతడు 11 ఆటగాళ్లతో సమానమని కితాబు ఇచ్చాడు.
Also Read : కోహ్లీ ఇదీ ఒక ఇన్నింగ్సేనా – కనేరియా