Anna Hazare Comment : ‘కేజ్రీ’ నిర్వాకం ‘అన్నా’ లేఖాస్త్రం
గతం మరిచి పోతే ఎలా కేజ్రీవాల్
Anna Hazare Comment : అన్నా హజారే గురించి చెప్పాల్సిన పని లేదు. పరిచయం అంతకన్నా అక్కర్లేదు. కానీ ఆయన ఏది మాట్లాడినా దేశం కోసం మాట్లాడతారు. ప్రజల బాగోగుల గురించి ప్రశ్నిస్తారు.
పాలకులు ప్రజా సేవకులు మాత్రమేనని ధనం, రాజకీయం, నేరం, మతం కలిసి ఉండ కూడదని కుండ బద్దలు కొడతారు.
అన్నా హజారే(Anna Hazare) వ్యక్తి కాదు సమున్నత శక్తి. అన్నా అంటేనే నిరాడంబర జీవితం. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా పేరొందారు. ఇప్పటికే గాంధేయ వాదాన్ని, అంబేద్కర్ మానవతా వాదాన్ని బలంగా నమ్మిన వ్యక్తులలో అన్నా హజారే ఒకరు.
భారత దేశ రాజకీయాలలో అన్నా హజారే ఢిల్లీ వేదికగా చేపట్టిన ప్రజా ఉద్యమం చారిత్రాక విజయాన్ని సాధించింది. చరిత్రలో సుస్థిరమైన స్థానం పొందింది.
ఇవాళ మరోసారి అన్నా హజారే చర్చనీయాంశంగా మారారు. తన బాటలో నడుస్తూ, తనను ముందు పెట్టి ఉద్యమించి పవర్ లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు.
ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రెండు పేజీలతో సుదీర్ఘమైన లేఖ రాశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇది కలకలం
రేపుతోంది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ ప్రభుత్వం ఏరికోరి మద్యం పాలసీని తీసుకు వచ్చింది.
దీనిపై రాద్దాంతం కొనసాగుతోంది. సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. డిప్యూటీ సీఎంతో పాటు 14 మంది ఉన్నతాధికారులపై అభియోగాలు మోపింది.
ఇదే సమయంలో ఎందుకు మద్యం పాలసీని తీసుకు రావాల్సి వచ్చిందనే దానిపై అన్నా హజారే నిలదీశారు. నేరుగా సీఎంను ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సీఎం అయ్యాక తన ఆదర్శ సూత్రాలను మరిచి పోయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.
అధికారం అనే మత్తులో కూరుకు పోతే ఇలాంటి అనర్థాలకు తావిచ్చిన వారవుతారని హెచ్చరించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం
వహించిన తాను ఇలాంటి పాలసీని తీసుకు వస్తారని తాను కలలో కూడా అనుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అన్నా హజారే.
ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిర్మూలనా వాది. 2011 నాటి చారిత్రాత్మక అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. రాజకీయ పార్టీ ఏర్పాటును ఆనాడే పూర్తిగా వ్యతిరేకించాడు అన్నా హజారే.
ఒక రకంగా చెప్పాలంటే చారిత్రాత్మక ఉద్యమాన్ని పణంగా పెట్టింది ఆప్. అన్ని పార్టీల లాగేనే అది కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ మండిపడ్డారు.
దేశంలో అవినీతిని అరికట్టేందుకు లోక్ పాల్ , లోకాయుక్తకు అనుకూలంగా ఉన్న కేజ్రీవాల్ పవర్ లోకి వచ్చాక అన్నీ మరిచి పోయాడంటూ ఎద్దేవా చేశారు.
వీటిపై చట్టాలు తీసుకు రాకుండా ఎక్సైజ్ పాలసీతో కుటుంబాలను సర్వ నాశనం చేసేందుకు నడుం బిగించడం దారుణమని ఇది క్షమార్హం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నా హజారే(Anna Hazare).
Also Read : జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాయ్ పూర్ కు