Need Sanitary Napkins : ‘న్యాప్ కిన్స్’ కోసం జడ్జికి విన్నపం
ఢిల్లీ కోర్టు డిస్పెన్సరీలో ఉంచేలా ఆదేశించండి
Need Sanitary Napkins : దేశ వ్యాప్తంగా మహిళలు, యువతులు, బాలికలు నిత్యం నెల నెలా ఎదుర్కొనే సమస్య. ఇటీవలి కాలంలో టెక్నాలజీ మారింది. వసతి సౌకర్యాలు కూడా పెరిగాయి. కానీ మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది.
ఇటీవల కేంద్ర మంత్రి మహారాష్ట్రలో పర్యటించిన సమయంలోనూ మహిళ శాస్త్రవేత్తలు శానిటరీ న్యాపికిన్స్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చాలా దేశాలలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలలో పని చేస్తున్న మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని దేశాలలో ప్రత్యేకించి ఆ నాలుగు రోజుల పాటు సెలవులు కూడా మంజూరు చేశారు.
ఇది పక్కన పెడితే తాజాగా కీలకమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా శానిటరీ న్యాపికిన్లు కావాలంటూ(Need Sanitary Napkins) ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇంటర్న్ లు రాయడం కలకలం రేపింది.
ప్రధానంగా కోర్టు ప్రాంగణంలో, ఆవరణలో శానిటరీ న్యాప్ కిన్లు అందుబాటులో లేవని , కోర్టు డిస్పెన్షరీలో కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని సదరు మహిళ తన లేఖలో జస్టిస్ కు రాయడం చర్చకు దారి తీసింది. శానిటరీ న్యాప్ కిన్ లను వెండింగ్ మెషీన్ ద్వారా లేదా మరే ద్వారానైనా అందించాలని ఇంటర్న్ అభ్యర్థించారు.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని మహిళా న్యాయవాది కోరడం ఇప్పుడు దేశమంతటా చర్చకు దారి తీసింది.
తాను ఆగస్టు 1 నుంచి హైకోర్టు న్యాయవాది కింద పని చేస్తున్నానని, తనకు న్యాప్ కిన్ అవసరమని భావించిన వెంటనే కోర్టు డిస్పెన్సరీకి వెళితే లేదంటూ సమాధానం వచ్చిందని తెలిపారు.
Also Read : ఆజాద్ తో అసమ్మతి నేతల భేటీ