Bakingo Bakery Success : బేకరీ వ్యాపారం రూ. 75 కోట్ల ఆదాయం
ముగ్గురు స్నేహితులు సాధించిన విజయం
Bakingo Bakery Success : విజయం ఊరికే రాదు. కష్టపడితే, వినూత్నంగా ఆలోచిస్తే, భిన్నంగా ముందుకు వెళితే వస్తుంది. ప్రపంచంలో ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఫుడ్ పరంగా ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది.
దానికి క్రేజ్ తగ్గదు. ఫంక్షన్లు, బర్త్ డేలు, కొత్త సంవత్సరం ఇలా ప్రతి ఫంక్షన్ కు బేకరీలను ఆశ్రయించడం అలవాటు జనాలకు. టెక్నాలజీ మారింది. కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ కామర్స్ బిజినెస్ కు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో ఆన్ లైన్ వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. కరోనా దెబ్బకు ప్రత్యక్ష వ్యాపారంపై ప్రభావం చూపినా ఆన్ లైన్ బిజినెస్ మాత్రం మరింత పెరిగింది.
కీలక మార్కెట్ ను శాసిస్తోంది. చూస్తే బేకరీ అని తీసి పారేయకండి. ఏకంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు ముగ్గురు. వారంతా ప్రాణ స్నేహితులు. కలిసే ఉన్నారు..కలిసి స్వంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు.
చివరకు రూ. 75 కోట్ల ఆదాయాన్ని గడించేలా గర్వకారణమై నిలిచారు. ఇది కళ్ల ముందు కనిపించే విజయ గాధ. ఇలాంటివి కొందరికి రుచించక పోవచ్చు.
కానీ పట్టుదల, నాణ్యత, నమ్మకం ఉంటే వ్యాపారంలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదని వీరిని చూస్తే తెలుస్తుంది.
ఇంత పెద్ద మొత్తంలో విస్తరించి గణనీయమైన లాభాలను ఆర్జిస్తున్న బేకరీకి(Bakingo Bakery) పెట్టిన పెట్టుబడి కేవలం రూ. 2 లక్షలు మాత్రమే. విచిత్రం కదూ. నమ్మలేని వాస్తవం కూడా.
బేకింగో పేరుతో ఫిబ్రవరి 2010లో ఆన్ లైన్ లో బేకరీని ప్రారంభించారు. ఇది క్లౌడ్ కిచెన్ మోడల్ లో పని చేస్తుంది. దేశంలోని 11 నగరాలకు విస్తరించింది. బహుళ కోట్ల ఆదాయ వనరుగా మారింది.
న్యూఢిల్లీ లోని నేతాజీ సుభాష్ యూనివర్శిటీకి చెందిన ముగ్గురు కాలేజీ స్నేహితులు హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్ , సుమన్ పాత్ర. కాలేజీ చదువు పూర్తయ్యాక ముగ్గురూ మొదటి వెంచర్ ఫ్లర్ ఆరాను స్థాపించారు.
ఇది ఆన్ లైన్ లో ఫ్లవర్ , కేక్ ను అందిస్తుంది. గురుగ్రామ్ లో ఉంది. ప్రారంభంలో ఒక్కరితోనే ప్రారంభమైంది. 2016లో చావ్లా, సెహగల్ , సుమన్ కొత్త కంపెనీ కింద బేకింగో(Bakingo Bakery) ను ప్రత్యేక బ్రాండ్ గా స్థాపించారు.
ఒకే రకమైన రుచితో తాజా కేక్ ల బ్రాండ్ ను అందించే వ్యాపారం విజయం సాధించింది. దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించింది.
30 శాతం విక్రయాలు బేకింగో పోర్టల్ ద్వారా జరుగుతుండగా మిగిలిన 70 శాతం విక్రయాలు స్విగ్గీ, జొమాటో , ఇతర ఆహార పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరాన్ని రూ. 75 కోట్ల టర్నోవర్ తో ముగిసింది. 500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. సో స్నేహం కోట్లాది వ్యాపారాన్ని సాధించేలా చేసింది. హ్యాట్సాఫ్ ఫ్రెండ్స్ .
Also Read : ప్రపంచ కుబేరుల్లో అదానీకి మూడో స్థానం