Afghan Fans Fire : ఆఫ్గాన్ పరాజయం అభిమానుల ఆగ్రహం
పాకిస్తాన్ లాంజ్ లోకి కుర్చీల విసిరివేత
Afghan Fans Fire : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ – 2022 లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో ఒకే ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ అతి కష్టం మీద గెలుపొందింది.
130 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన పాకిస్తాన్(PAK vs AFG) చివరి బంతి దాకా పోరాడింది. ఒకానొక దశలో ఓటమి అంచుకు చేరింది. ఇప్పటికే భారత్ ను ఓడించి శ్రీలంక ఫైనల్ కు చేరింది.
ఇదిలా ఉండగా తమ జట్టు గెలుస్తుందని అనుకున్న ఆఫ్గనిస్తాన్ అభిమానులు స్టేడియంలో ఓటమి పాలయ్యే సరికి(Afghan Fans Fire) ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కుర్చీలు విసిరారు.
పలు కుర్చీలను విరగ్గొట్టారు. మరికొన్నింటిని విసిరేశారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మరికొందరు ఆగ్రహంతో ఏకంగా పాకిస్తాన్ ఫ్యాన్స్ పైకి దూసుకు వెళ్లేలా కుర్చీలను విసిరేశారు.
ఇరు జట్ల మధ్య ఎన్నో మ్యాచ్ లు జరిగినప్పటికీ సూపర్ -4 లో భాగంగా జరిగిన ఈ కీలక మ్యాచ్ ఎల్లప్పటికీ గుర్తుండి పోతుంది. పాకిస్తాన్ పేసర్ నసీమ్ షా ఈ మ్యాచ్ లో హీరోగా మారాడు ఆ జట్టు తరపున.
ఒక వేళ నసీమ్ షా సిక్సర్లు కొట్టక పోయి ఉంటే కచ్చితంగా ఓటమి పాలై ఉండేది. ఆఖరి ఓవర్ లో గెలవాలంటే పాకిస్తాన్ కు 11 రన్స్ కావాల్సి వచ్చింది.
దీంతో పరాజయాన్ని తట్టుకోలేక అభిమానులు రెచ్చి పోయారు. ఆపై దాడులకు దిగేందుకు ప్రయత్నం చేశారు. ఒకరకంగా అసహ్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది.
ఈ రచ్చకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్విట్టర్ లో పంచుకున్నారు.
Also Read : ఆఫ్గన్ బౌలర్ తో పాకిస్తాన్ క్రికెటర్ గొడవ