Virat Kohli : గత కొంత కాలంగా పేలవమైన ఫామ్ తో తీవ్ర నిరాశకు గురి చేస్తూ వచ్చిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022 లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన నామ మాత్రపు మ్యాచ్ లో దుమ్ము రేప్పాడు. ఇప్పటికే శ్రీలంక
ఆఫ్గనిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరుకోగా పాకిస్తాన్ భారత్ ను ఓడించి నేరుగా ఫైనల్ కు చేరుకుంది.
ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించి టీం ఇండియా. మూడు సంవత్సరాలకు పైగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు కోహ్లీ(Virat Kohli) . ఇప్పటి దాకా పరుగులు
చేసేందుకు నానా తంటాలు పడిన కోహ్లీ ఆఫ్గనిస్తాన్ బౌలర్లకు చుక్కలు (Virat Kohli) చూపించాడు.
పొట్టి ఫార్మాట్ లో భారత జట్టు తరపున అత్యధిక వ్యక్తిగత రన్స్ రికార్డు సృష్టించాడు కోహ్లీ. రోహిత్ శర్మ కు రెస్ట్ ఇవ్వగా కేఎల్ రాహుల్ ,
కోహ్లీ ఓపెనింగ్ బరిలో దిగారు.
వచ్చీ రావడంతోనే కేఎల్ రాహుల్ దంచి కొట్టడం స్టార్ట్ చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యాక వేటాడడం మొదలు పెట్టాడు రన్ మెషీన్. ఇద్దరూ కలిసి ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు.
మరో వైపు స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసి ఆఫ్గనిస్తాన్ ను శాసించాడు. విరాట్ కోహ్లీ 61 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 12 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 62 రన్స్ చేశాడు. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో మైదానంలోకి వచ్చిన ఆఫ్గనిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేసి 111 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఇక
ఆఫ్గాన్ జట్టులో జద్రాన్ ఒక్కడే అద్భుతంగా రాణించాడు. 64 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read : ఆఫ్గాన్ పరాజయం అభిమానుల ఆగ్రహం