PM Modi : ప‌శువుల వ్యాధుల క‌ట్ట‌డికి వ్యాక్సిన్ సిద్దం – మోదీ

రోగాల‌ను న‌యం చేస్తుంద‌ని ప్ర‌ధాని

PM Modi :  భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశారు. ప‌శువులలో త‌రుచుగా వ‌చ్చే రోగాల‌ను న‌యం చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని చెప్పారు.

సోమ‌వారం ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప‌శువుల‌లో త‌రుచుగా వ‌చ్చే లంపి స్కిన్ డిసీజ కోసం భార‌త దేశంలో టీకా (వ్యాక్సిన్ ) ను సిద్దం చేశామ‌ని చెప్పారు.

అనేక రాష్ట్రాలలోని ప‌శువులు ఎల్ఎస్డీతో బాధ ప‌డుతున్నాయ‌ని తెలిపారు. ఈ వ్యాధి కార‌ణంగా పాడి ప‌శువులు పాలు ఎక్కువ‌గా ఇవ్వ‌లేక పోతాయ‌ని తెలిపారు.

ఇది పాడి పరిశ్ర‌మ‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంద‌న్నారు మోదీ. చాలా ప‌శువులు అర్ధాంత‌రంగా చ‌ని పోయాయ‌ని తీవ్ర న‌ష్టం వాటల్లింద‌న్నారు.

ఇందుకు సంబంధించి ఈ వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తోంద‌ని చెప్పారు మోదీ.

దేశానికి చెందిన ప‌శు సంబంధ‌మైన శాస్త్ర‌వేత్త‌లు లంపి స్కిన్ డిసీజ్ కు స్వ‌దేశీ వ్యాక్సిన్ ను కూడా సిద్దం గా ఉంచార‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

ఇండియా ఎక్స్ పో సెంట‌ర్ అండ్ మార్ట్ లో నిర్వ‌హిస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ డెయిర్ ఫెడ‌రేష‌న్ వ‌ర‌ల్డ్ డైరీ స‌మ్మిట్ 2022లో ప్ర‌ధాన మంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ఇటీవ‌లి కాలంలో ఈ వ్యాధి కార‌ణంగా దేశంలో చాలా ప్రాంతాల్లో ప‌శువుల న‌ష్టం జ‌రిగింద‌న్నారు ప్ర‌ధాన మంత్రి. ఎల్ఎస్డీ అనేది ఒక అంటు వ్యాధి. ఇది ప‌శువుల‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తుంద‌న్నారు.

Also Read : రాజ్ నాథ్ సింగ్ కీల‌క కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!