9 Dead Lucknow Rain : లక్నోలో భారీ వర్షం 9 మంది దుర్మరణం
వర్షం దెబ్బకు కూలిన గోడతో పరేషాన్
9 Dead Lucknow Rain : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర ప్రదేశ్ ను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర రాజధాని లక్నోలో భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో 9 మంది దుర్మరణం(9 Dead Lucknow Rain) చెందారు.
మరికొందరు గాయపడగా క్షతగాత్రులను సివిల్ ఆస్పత్రికి తరలించారు. వారు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారని వైద్యులు తెలిపారు.
గోడ కూలిన ఘటన తెలిసిన వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గత 24 గంటలుగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
ఉన్నట్టుండి వర్షపు తాకిడికి గోడ ఉన్నట్టుండి కూలి పోవడంతో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా కొంతమంది కార్మికులు దిల్కుషా ప్రాంతంలోని ఆర్మీ ఎన్ క్లేవ్ వెలుపల పూరి గుడిసెలలో నివసిస్తున్నారు.
రాత్రి పూట భారీ వర్షాలు కురుస్తూనే(Lucknow Floods) ఉండడంతో ఆర్మీ ఎన్ క్లేవ్ సరిహద్దు గోడ కూలి పోయిందని జాయింట్ పోలీస్ కమిషనర్ ( లా అండ్ ఆర్డర్ ) పీయూష్ మోర్డియా వెల్లడించారు.
ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. తాము ఘటన గురించి తెలిసిన వెంటనే తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నాం. శిథిలాల మధ్య చిక్కుకు పోయిన తొమ్మిది మృతదేహాలను బయటకు తీశామన్నారు.
ఒక వ్యక్తి ఈ ఘటన నుంచి సజీవంగా బయట పడ్డాడని పేర్కొన్నారు. విషయం తెలిసిన సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలలను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : మోదీ వల్లే గుజరాత్ కు చిప్ ఫ్యాక్టరీ – పవార్