Aaditya Thackeray Modi : మోదీ వల్ల లక్ష జాబ్స్ కోల్పోయాం
చిప్ కంపెనీ గుజరాత్ కు తరలి పోయింది
Aaditya Thackeray Modi : శివసేన నాయకుడు, మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నిర్వాకం కారణంగానే తమకు రావాల్సిన చిప్ కంపెనీని గుజరాత్ కు తరలించుకు పోయారంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.
ఒక వేళ చిప్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటే కనీసం లక్ష జాబ్స్ వచ్చి ఉండేవన్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీ సంకీర్ణ షిండే ప్రభుత్వం అంటూ మండిపడ్డారు ఆదిత్యా ఠాక్రే(Aaditya Thackeray).
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రకంగా మోదీ మరాఠా ప్రజలను అవమానానికి గురి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గుజరాత్ కు పీఎం కాదని దేశానికి ప్రధాన మంత్రి అన్న సంగతి మరిచి పోయరంటూ ఫైర్ అయ్యారు ఆదిత్యా ఠాక్రే.
గతంలో కొలువు తీరిన మహా వికాస్ అఘాడీ వేదాంత కంపెనీ చిప్ కంపెనీ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. కానీ తెలివిగా గుజరాత్ కు తరలించుకు పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి.
ఇది పూర్తిగా సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fednavis) బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. $20 బిలియన్ల అంచనాతో కూడిన ప్రాజెక్టును కోల్పోవడం వల్ల ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించకుండా పోయిందన్నారు.
మరాఠా ప్రజలు ఎప్పటికీ మోదీ, అమిత్ షా, షిండే, ఫడ్నవీస్ లను క్షమించరన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసుకుంటూ పోవడం తప్పితే ఆయా రాష్ట్రాలను ఆదుకోవాలన్న తపన ప్రధానికి లేకుండా పోయిందన్నారు.
Also Read : మోదీ వల్లే గుజరాత్ కు చిప్ ఫ్యాక్టరీ – పవార్