Jay Shah BCCI Boss : జే షాకు లైన్ క్లియర్
ఐసీసీ రేసులో గంగూలీ
Jay Shah BCCI Boss : ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరొందింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). బీసీసీఐ చీఫ్, కార్యదర్శి పదవుల పొడిగింపుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
డీవై చంద్రచూడ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. దీంతో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాలకు ఊరట
లభించింది. కొద్ది రోజుల్లో వీరి పదవీ కాలం పూర్తి కానుంది.
ఈ మేరకు వీరికి అనుకూలంగా తీర్పు రావడంతో సంతోషానికి లోనవుతున్నారు జేషా, దాదా. ఇప్పటికే అంతా తానై వ్యవహరిస్తున్నారు జే షా. దీంతో
బీసీసీఐలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
జస్టిస్ లోధా సంస్కరణల ప్రకారం బోర్డు తయారు చేసిన రాజ్యాంగానికి కీలక సవరణలు చేపట్టింది. వీటికి సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. జే షా, గంగూలీ ఎంత కాలమైనా ఉండొచ్చన్నమాట.
ఇప్పటికే అనధికారికంగా మోత్తం జే షా(Jay Shah BCCI Boss) కనుసన్నలలో నడుస్తోంది బీసీసీఐ. ఇప్పటికే జే షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి
చైర్మన్ గా ఉన్నారు. మరో వైపు సౌరవ్ గంగూలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ రేసులో ఉన్నారు.
ఇందుకు సంబంధించి త్వరలో బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) ఏర్పాటు చేయనుంది. జే షా పవర్ ఫుల్ వ్యక్తిగా మారారు.
ఎందుకంటే ఆయన తండ్రి దేశ రాజకీయాలను శాసిస్తున్న కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). ఇక బీజేపీ రూల్స్ ప్రకారం
ఒకరికి ఒకే పదవి ఉండాలి.
కానీ అమిత్ షా విషయంలో అది వర్తించదు. ఇక జే షా చీఫ్ గా ఎన్నికయ్యేందుకు దేశంలోని 15 రాష్ట్ర క్రీడా సంస్థలు మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.
2019లో గంగూలీ, షా ఎన్నికయ్యారు. 12 ఏళ్ల పాటు కొనసాగవచ్చంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఒక వేళ దాదా గనుక ఐసీసీ చీఫ్ గా ఎన్నికైతే
జే షా బీసీసీఐ చీఫ్ గా ఎన్నికయ్యేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ టాప్