Manish Sisodia : ఎమ్మెల్యేలను విభజించేందుకు కుట్ర

బీజేపీపై నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం

Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా(Manish Sisodia) సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్రాన్ని, భార‌తీయ జ‌న‌తా పార్టీని టార్గెట్ చేశారు. ప్ర‌శాంతంగా ఉన్న ఆప్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఎక్సైజ్ పాల‌సీ పేరుతో చేసిన ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ఇవాళ ఢిల్లీ వ‌క్ఫ్ బోర్డు నియామకాల్లో అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఈడీ అరెస్ట్ చేసింది.

దీనిపై ఆప్ సీరియ‌స్ గా స్పందించింది. ఇదంతా ఓ కుట్ర త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు మ‌నీష్ సిసోడియా. క‌లిసి క‌ట్టుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విభ‌జించేందుకు ప్లాన్ చేస్తోందంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే తాము అసెంబ్లీలో బ‌లం ఏమిటో నిరూపించు కున్నామ‌ని చెప్పారు. ఆప‌రేష‌న్ లోట‌స్ చాలా చోట్ల స‌క్సెస్ అయ్యింద‌ని కానీ ఢిల్లీలో, ఆప్ విష‌యంలో వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో వారికి జార్ఖండ్ లో కూడా ప్లాన్ చేశార‌ని అక్క‌డ హేమంత్ సోరేన్(Hemanth Soren) దెబ్బ‌కు ఖంగు తిన్నార‌ని పేర్కొన్నారు. ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు ప‌న్నినా బీజేపీ ఆట‌లు సాగ‌వ‌న్నారు.

మోదీ, అమిత్ షా వ్యూహాలు ఇక్క‌డ ప‌ని చేయ‌వంటూ స్ప‌ష్టం చేశారు. త‌మ ఎమ్మెల్యేల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తూ కొనుగోలు చేయాల‌ని చూస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇప్ప‌టికే గోవాలో ఇలాంటి ప‌ని చేసింద‌ని మండిప‌డ్డారు. కానీ త‌మ ప్ర‌జా ప్ర‌తినిధులు లొంగే ర‌కం కాద‌న్నారు.

Also Read : ఎయిమ్స్ పేరు మార్పుపై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!