Delhi AIIMS Name Change : ఎయిమ్స్ పేరు మార్పుపై ఆగ్ర‌హం

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సీరియ‌స్ లేఖ

Delhi AIIMS Name Change : కేంద్రంలో కొలువు తీరిన మోదీ(PM Modi) బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం పేర్ల మార్పుపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే రాజీవ్ ఖేల్ ర‌త్నను ధ్యాన్ చంద్ ఖేల్ ర‌త్నగా మార్చేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే గ‌త చ‌రిత్రకు సంబంధించిన ఆన‌వాళ్లు లేకుండా చేసే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉంది. ఈ త‌రుణంలో తాజాగా మ‌రో వివాదానికి తెర తీసింది కేంద్రం.

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఎయిమ్స్ ) ను పేరు మారుస్తార‌న్న(Delhi AIIMS Name Change) ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇదే స‌మ‌యంలో స్థానిక లేదా ప్రాంతీయ ప్ర‌ముఖులు, స్వాతంత్ర స‌మ‌ర యోధులు , చారిత్ర‌క సంఘ‌ట‌న‌లు లేదా ప్రాంతానికి సంబంధించిన చిహ్నాలు , వారి ప్ర‌త్యేక భౌగోళిక గుర్తింపు ఆధారంగా ఢిల్లీతో స‌హా అన్ని ఎయిమ్స్ ల‌కు నిర్దిష్ట‌మైన పేర్ల‌ను పెట్టేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాద‌న‌లు రూపొందించింది.

కాగా పేరు మార్చే ప్ర‌తిపాద‌న‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఎయిమ్స్ ఫ్యాక‌ల్టీ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండవియాకి లేఖ రాశారు.

అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఎయిమ్స్ ల‌కు కొత్త పేర్ల‌ను పెట్టాల‌న్న ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌పై ఫ్యాక‌ల్టీ అసోసియేష‌న్ ఆఫ్ ఎయిమ్స్ (ఫెయిమ్స్ ) ఇటీవ‌ల ఫ్యాక‌ల్టీ స‌భ్యుల అభిప్రాయాల‌ను కోరింది.

ఇందుకు గాను ఎయిమ్స్ పేరు మార్చేంద‌కు అధ్యాప‌కులు తీవ్రంగా వ్య‌తిరేకించార‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సుదీర్ఘ లేఖ రాసింది.  పేరుతో గుర్తింపు ముడిప‌డి ఉంటుంది. గుర్తింపు కోల్పోతే దేశంలో , వెలుప‌ల సంస్థాగ‌త ఆద‌ర‌ణ ల‌భించ‌ద‌ని పేర్కొన్నారు.

Also Read : 2023లో ప్ర‌పంచానికి మాంద్యం దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!