Security Beefed : హైద‌రాబాద్ టి20 మ్యాచ్ కు భ‌ద్ర‌త ప‌టిష్టం

భార‌త్, ఆస్ట్రేలియా మ్యాచ్ పై తీర‌ని ఉత్కంఠ

Security Beefed : మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ లో భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు చెరో మ్యాచ్ గెలుపొందాయి. దీంతో హైద‌రాబాద్ లో టి20 మ్యాచ్ కీల‌కం కానుంది. సీరీస్ ఎవ‌రో తేల్చే ఈ కీల‌క‌మైన మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది.

మ‌రో వైపు గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి టికెట్ల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. టికెట్ల కోసం జ‌రిగిన తొక్కిస‌లాటలో ఏకంగా ఏడుగురు క్రికెట్ అభిమానులు గాయ‌ప‌డ్డారు.

ఒక‌రి పరిస్థితి విష‌మంగా ఉండ‌డంతో హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ తో పాటు ఇత‌ర స‌భ్యుల‌పై మూడు చోట్ల కేసులు న‌మోద‌య్యాయి.

ఈ వ్య‌వ‌హారంలో త‌మ త‌ప్పు ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు మాజీ కెప్టెన్. ఇక ఆదివారం ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగే మూడో టి20 మ్యాచ్ పై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సివి ఆనంద్ రంగంలోకి దిగారు. ఉప్ప‌ల్ స్టేడియంగా ప్ర‌సిద్ది చెందిన రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం(Security Beefed)  చేశారు.

స్టేడియం చుట్టూ 2,500 మంది పోలీసుల‌ను మోహ‌రించారు. స్టేడియంలో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల గురించి రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ ఎం భ‌గ‌వత్ మాట్లాడారు.

స్టేడియం లోప‌ట బ‌య‌ట 300కు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయ‌ని చెప్పారు.ఒక ఇన్స్ పెక్ట‌ర్ , టీం ప‌ర్య‌వేక్షిస్తున్న నిఘా కెమ‌రా ఫుటేజీని ప‌ర్యవేక్షించేందుకు జాయింట్ క‌మాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

Also Read : వ‌చ్చే ఏడాది నుంచే రూ. 2,750 పింఛ‌న్

Leave A Reply

Your Email Id will not be published!