HCA President : తొక్కిసలాటకు మేం కారణం కాదు – అజారుద్దీన్
ఇందుకు హెచ్‌సీఏ బాధ్యత వహించదని ప్రకటన
HCA President : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్(HCA President) , భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ మొత్తం వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించారు అజారుద్దీన్. తొక్కిసలాటకు తాము కారణం కానే కాదని పేర్కొన్నారు.
అక్కడ భద్రత కల్పించాల్సింది పోలీసులేనని స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే టి20 మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విక్రయానికి పలు చర్యలు తీసుకుందన్నారు అజారుద్దీన్.
ఇక తొక్కిసలాటలో గాయపడిన వారి వైద్య ఖర్చులను తామే భరిస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15న పేటిఎం లో మొత్తం 11,450 టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించామని చెప్పారు అజారుద్దీన్.
సెప్టెంబర్ 22న 3,000 టికెట్లు ఆఫ్ లైన్ లో విక్రయించినట్లు వెల్లడించారు. మిగిలిన 6,000 టికెట్లను స్పాన్సర్ లు, ఇంటర్నెట్ వాటాదారులు, కార్పొరేట్లకు విక్రయించినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెడ్(HCA President) తెలిపారు.
మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించే కాంట్రాక్టును పేటీఎంకు అప్పగించామని వారి తప్పులతో మకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
మ్యాచ్ టికెట్లను నిషేధించారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టిక్కెట్ల విక్రమ సమయంలో జింఖానాలో ఏం జరిగిందో పోలీసులకు తెలుసన్నారు మహమ్మద్ అజారుద్దీన్.
తమ వైపు నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు. టికెట్ల విక్రయానికి సంబంధించి పూర్తి రిపోర్ట్ రెడీగా ఉందన్నారు మహమ్మద్ అజారుద్దీన్.
Also Read : హైదరాబాద్ టి20 మ్యాచ్ కు భద్రత పటిష్టం