CP Mahesh Bhagwat : క్రికెట్ మ్యాచ్ కోసం ట్రాఫిక్ రూల్స్

వాహ‌న‌దారుల‌కు త‌ప్ప‌ని ఇక్క‌ట్లు

CP Mahesh Bhagwat : భార‌త‌, ఆస్ట్రేలియా జ‌ట్ల టి20 సీరీస్ విజేత ఎవ‌రో నిర్ణ‌యించే కీల‌క‌మైన మూడో టి20 మ్యాచ్ కు వేదిక కానుంది హైద‌రాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం.

ఇప్ప‌టికే టికెట్ల లొల్లి బ‌ద్నాం చేసింది. న‌గ‌రంలో ట్రాఫిక్ ప‌రిమితులు అమ‌లు చేయ‌నున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, డ్యూటీ ఆఫీస‌ర్స్ , మీడియాతో

స‌హా 40,000 వేల మంది హాజ‌రవుతార‌ని అంచ‌నా.

ఇందుకు సంబంధించి రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్(CP Mahesh Bhagwat)  ఎవ‌రెవ‌రు ఎటు వైపు నుంచి వెళ్లాల‌నేది ప్ర‌క‌టించారు. తార్నాక నుండి వీఐపీ పాస్ హోల్డ‌ర్లు హ‌బ్సిగూడ – ఎన్జీఆర్ఐ, ఏక్ మినార్ , గేట్ నెంబర్ -1 మీదుగా స్టేడియానికి వెళ్లాలి.

ఏ – సీ పార్కింగ్ స్లాట్ ల‌లో త‌మ వాహ‌నాలు పార్క్ చేయాలి. ఇక అంబ‌ర్ పేట నుండి వీఐపీ పాస్ హోల్డ‌ర్లు దూర‌ద‌ర్శ‌న్ – రామంతాపూర్ – గేట్ నెంబ‌ర్ 1 వైపు వెళ్లాలి.

త‌మ వాహ‌నాల‌ను ఏ, సీ పార్కింగ్ ల‌లో వాహ‌నాలు ఉంచాలి. నాగోల్ , వ‌రంగ‌ల్ హైవే మీదుగా స్టేడియంలోకి ప్ర‌వేశించే వీఐపీ పాస్ హోల్డ‌ర్లు ఉప్ప‌ల్

క్రాస్ రోడ్ – స‌ర్వే ఆఫ్ ఇండియా – ఏక్ మినార్ గేట్ నెంబ‌ర్ -1 వ‌ర‌కు రావాలి.

ఏ, సీ పార్కింగ్ వ‌ద్ద త‌మ వాహ‌నాలు పార్క్ చేయాల‌ని సూచించారు. హ‌బ్సిగూడ నుండి ఉప్ప‌ల్ రోడ్డుకు వ‌చ్చే ద్విచ‌క్ర , నాలుగు చ‌క్రాల వాహ‌నాలు

ఎన్జీఆర్ఐ గేట్ నెంబ‌ర్ 1 నుండి 3 వ‌ర‌కు స్టేడియం మెట్రో పార్కింగ్ వ‌ర‌కు ఎడమ వైపు పార్క్ చేయాలి.

ఇక ఉప్ప‌ల్ నుండి హ‌బ్సీగూడ రోడ్డుకు వ‌చ్చే వాహ‌నాల‌ను జెన్ పాక్ట్ స‌ర్వీస్ రోడ్డులో హిందూ ఆఫీస్ లేన్ వైపుగా పార్క్ చేయాలి.

ఉప్ప‌ల్ నుండి రామంతాపూర్ , రామంతాపూర్ నుండి ఉప్ప‌ల్ వైపు వ‌చ్చే నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌ను పోలీస్ సెల్లార్ లో, మోడ్ర‌న్ బేక‌రీ లోప‌ల‌, శ‌క్తి

డిట‌ర్జంట్ ఓపెన్ ప్లేస్ లోప‌ల , డీఎస్ఎల్ ఓపెన్ లాండ్ , ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో పార్క్ చేయాల‌ని సూచించారు.

Also Read : తొక్కిస‌లాట‌కు మేం కార‌ణం కాదు – అజారుద్దీన్

Leave A Reply

Your Email Id will not be published!