Gautam Adani : చైనా ఒంటరిగా ఫీలవుతోంది – అదానీ
సంచలన కామెంట్స్ చేసిన వ్యాపారవేత్త
Gautam Adani : ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీ(Gautam Adani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. మంగళవారం సింగపూర్ లో జరిగిన సమావేశంలో గౌతం అదానీ మాట్లాడారు. బీజింగ్ ప్రపంచ ఆశయాలను సవాల్ చేస్తూ చైనా అనేక దేశాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు.
వరల్డ్ వైడ్ గా రెండో కుబేరుడిగా పేరొందిన గౌతం అదానీ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెరుగుతున్న జాతీయవాదం, చోటు చేసుకుంటున్న మార్పులు , సాంకేతిక నియంత్రణలు ప్రపంచం లోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందంటూ ఇందుకు సంబంధించి చైనా మరింత ఒంటరిగా భావించ బడుతోందని సంచలన కామెంట్స్ చేశారు గౌతం అదానీ.
1990లో కోల్పోయిన దశాబ్దం లో జపాన్ కు ఏం జరిగిందో దానితో పోల్చి చూసేందుకు అక్కడ ప్రాపర్టీ మార్కెట్ మెల్ట్ డౌన్ అయ్యిందన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థలన్నీ కాలక్రమేణా సరి చేయబడతాయని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి చోటా ప్రతి రంగంలో ఘర్షణ అన్నది అనివార్యంగా మారిందన్నారు గౌతం అదానీ(Gautam Adani).
ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టి వేసే విధంగా వడ్డీ రేట్లను పెంచడం ద్వారా సెంట్రల్ బ్యాంకులు ఊహించ లేనివి చేస్తున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దిగ్గజ వ్యాపారవేత్త. పరివర్తన కోసం $70 బిలియన్ల పెట్టుబడి పెట్టాలనే తన ప్రణాళికలను పునరుద్ఘాటించారు గౌతం అదానీ.
భారత్ కూడా పునరుత్పాదక ఇంధనంపై భారీ పెట్టుబుడలను యోచిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
Also Read : భారత్ లో ఐ ఫోన్ 14 తయారీకి రెడీ