Priyanka Gandhi : కాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక గాంధీ బెటర్
అక్టోబర్ 17న పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక
Priyanka Gandhi : ఏఐసీసీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ బరిలో ఉండమని స్పష్టం చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో మాజీ సీఎంలు కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ , ముకుల్ వాస్నిక్ , దీపిందర్ హూడా బరిలో ఉన్నారు.
ప్రియాంక గాంధీ సరైన నాయకురాలు అని పేర్కొన్నారు ఎంపీ. వాద్రా కుటుంబానికి కోడలు అయినందున భారతీయ సంప్రదాయం ప్రకారం ఆమె గాంధీ కుటుంబానికి చెందినది కాదు. ప్రియాంకా వాద్రా ఇకపై గాంధీ కాదు అందుకే ఆమె పార్టీ చీఫ్ గా ఉండాలన్నారు పార్టీకి చెందిన ఎంపీ అబ్దుల్ ఖలేక్.
గురువారం తన అధికారిక ట్విట్టర్ లో అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఎంతో మంది పోటీ పడుతున్నారని కానీ ప్రియాంక గాంధీనే సరైన వ్యక్తి అంటూ స్పష్టం చేశారు.
ఆమె ఎలాంటి భేషజాలకు పోకుండా పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలని కోరారు. ఇదిలా ఉండగా ఎంపీ అబ్దుల్ ఖలేక్ బార్బేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే తాను బరిలో ఉండనంటూ ప్రకటించారు. దీంతో పార్టీ చీఫ్ పదవికి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) నే సరైన నాయకురాలని పేర్కొన్నారు.
కాగా పార్టీ బాధ్యతలు చేపట్టాలన్న కార్యకర్తలు, నాయకుల కోరికను తాను గౌరవిస్తున్నానని కాగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ తదుపరి పార్టీ చీఫ్ గా ఉండరని నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ(Rahul Gandhi) తనతో చెప్పారని ఇప్పటికే ప్రకటించారు సీఎం అశోక్ గెహ్లాట్.
ఆయన చేసిన కామెంట్స్ తర్వాత ఎంపీ ప్రియాంక గాంధీ ఉండాలని కోరవడం విశేషం. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల విభాగాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ కావాలని. కానీ గాంధీ ఒప్పుకోలేదు. ఆయన భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు.
Also Read : ఏపీకి కేంద్రం తీపి కబురు