Nitin Gadkari : కార్ల‌ల్లో 6 ఎయిర్ బ్యాగ్ లు త‌ప్ప‌నిస‌రి – గ‌డ్క‌రి

కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి

Nitin Gadkari : కేంద్ర ఉప‌రిత‌ల‌, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకున్న కార‌ణంగా వ‌చ్చే ఏడాది 2023 నుంచి వాహ‌నాలలో 6 (ఆరు) ఎయిర్ బ్యాగ్ లు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని దీనిని ప్ర‌తి ఒక్క‌రు పాటించాల్సిందేన‌ని పేర్కొన్నారు.

ఎవ‌రు వాడ‌క పోయినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అంతే కాకుండా భారీ ఎత్తున ఫైన్ వేస్తామ‌ని హెచ్చ‌రించారు నితిన్ గ‌డ్క‌రీ(Nitin Gadkari). ఆటో ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని వాహ‌న‌దారుల క్షేమం కోసం ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు కేంద్ర మంత్రి.

గురువారం ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తూ త‌న అధికారిక ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. కొన్ని వారాల కింద‌ట నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ అన్ని కార్ల‌లో ఆరు ఎయిర్ బ్యాగ్ ల‌ను త‌ప్ప‌నిస‌రి చేసే దిశ‌గా త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు. ఇందులో భాగంగానే ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం.

వ‌చ్చే ఏడాది 2023 అక్టోబ‌ర్ నుంచి ప్యాసింజ‌ర్ కార్ల (ఎం1) కేట‌గిరీలో క‌నీసం ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉండేలా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. డ్రైవ‌ర్ సీటుతో పాటు ఎనిమిది సీట్ల‌కు మించ‌ని ప్ర‌యాణీకుల క్యారేజ్ కోసం ఉప‌యోగించే వాహ‌నాల‌ను ఎం1 వ‌ర్గం సూచిస్తుంది.

ఇదిలా ఉండ‌గా మోటారు వాహ‌నాల‌లో ప్ర‌యాణించే వారంతా వారి ఖ‌ర్చు, వేరియంట్ ల‌తో సంబంధం లేకుండా వారి భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు నితిన్ గ‌డ్క‌రీ.

Also Read : బెంగ‌ళూరులో రిల‌య‌న్స్ లైఫ్ స్టైల్ స్టోర్

Leave A Reply

Your Email Id will not be published!