Ponniyin Selvan : పొన్నియిన్ సెల్వన్ కు అత్యధిక రేటింగ్
ఐఎండీబీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్
Ponniyin Selvan : దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన భారీ చిత్రం అంచనాలు తలకిందులు చేస్తూ పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) విడుదలైన అన్ని చోట్లా భారీ ఆదరణ పొందింది.
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో విక్రమ్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ , జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభుత, ఆర్. శరత్ కుమార్ , విక్రమ్ ప్రభు నటించారు. ఇందులో ఐశ్వర్యా రాయ్ నటనకు వంద మార్కులు పడ్డాయి.
మణిరత్నం దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఎలాంగో కుమార్ వేల్ , బి. జయ మోహన్ లతో కలిసి రచించారు. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ కింద రత్నం, సుభాస్కరన్ అల్లిరాజా ఆర్థిక సాయం అందించారు.
ఇది 1955 నాటి కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) ఆధారంగా రెండు సినిమా భాగాలలో ఇది మొదటిది. ఈ నవల మొట్టమొదట 29 అక్టోబర్ 1950 నుండి 16 మే 1954 వరకు కల్కి వార పత్రికలో ధారా వాహికంగా ప్రచురించబడింది.
1955లో ఐదు భాగాలతో పుస్తక రూపంలో విడుదల చేశారు. ఐదు సంపుటాలలో 2,210 పేజీలు ఉన్నాయి. చోళ చక్రవర్తి రాజ రాజ చోళ అయ్యాడు. కల్కి మూడుసార్లు శ్రీలంక సందర్శించి దాని గురించిన సమాచారాన్ని సేకరించారు.
పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి అన్ని చోట్లా భారీ రేటింగ్ లు లభించడం విశేషం. ఇక ఐఎండీబీ రేటింగ్ లో ఆర్ఆర్ఆర్ ను అధిగమించింది. పొన్నియిన్ సెల్వన్ మూవీకి 9.4 రేటింగ్ రావడం గమనార్హం.
Also Read : ఐశ్వర్యా రాయ్ హల్ చల్