Ponniyin Selvan : రూ. 200 కోట్లు దాటిన పొన్నియిన్ సెల్వన్
చరిత్ర సృష్టించిన తమిళ చిత్రం
Ponniyin Selvan : దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) వసూళ్లను తిరగరాస్తోంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దేశ వ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్ కు భారీ ఆదరణ చూరగొంటోంది. సృజనాత్మకతకు పెట్టింది పేరు మణిరత్నం. దర్శకుడు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
ఇందులో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రధానంగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలా గ్యాప్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ లో నటించారు.
ఈ మూవీ కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని తీశాడు. 10 ఏళ్ల కిందట దీనిని ప్రారంభించినా అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి.
కరోనా ఎఫెక్టుతో చిత్ర షూటింగ్ ఆగి పోయింది. పలు ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు 8 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇది తెరకెక్కింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ , కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ , త్రిష తదితర నటులు నటించారు.
విడుదలకు ముందే మణిరత్నం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తీశాడు మణిరత్నం. మొదటి రోజు రూ. 80 కోట్లు రాబట్టింది. తాజాగా అందిన సమాచారం మేరకు రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది.
తమిళ సినీ రంగ చరిత్రలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా పొన్నియిన్ సెల్వన్. చిత్రానికి సంబంధించి రూ. 400 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. ఇంకా బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.
Also Read : బాలయ్య అన్ స్టాపబుల్ -2 రెడీ