IND vs SA 3rd ODI : సమ ఉజ్జీల పోరులో విజేత ఎవరో
భారత్..దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే
IND vs SA 3rd ODI : మూడు వన్డేల సీరీస్ లో కీలకమైన మ్యాచ్ అక్టోబర్ 11 మంగళవారం ఢిల్లీ వేదికగా జరగనుంది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొనసాగనుంది. మొదటి మ్యాచ్ ను భారత్ కేవలం 9 పరుగుల తేడాతో పోగొట్టుకుంది.
86 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ తో చివరి వరకు తీసుకు వచ్చాడు సంజూ శాంసన్. అయినా ఓటమి పాలైంది. దీంతో రాంచీలో జరిగిన రెండో మ్యాచ్ లో భారీ టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించింది. యువ ఆటగాళ్లు సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించారు.
ఇషాన్ కిషన్ 93 పరుగులు చేస్తే శ్రేయస్ అయ్యర్ సెంచరీతో కదం తొక్కాడు. ఇక ఎప్పటి లాగే సంజూ శాంసన్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో నిర్ణయాత్మకమైన వన్డే సీరీస్(IND vs SA 3rd ODI) కోసం ఈ మ్యాచ కీలకం కానుంది. ఇప్పుడు ఎవరు గెలిస్తే వారిదే సీరీస్ స్వంతం అవుతుంది.
స్వంత గ్రౌండ్ లో ఆడడం కెప్టెన్ శిఖర్ ధావన్ కు కలిసి వచ్చిందనే చెప్పక తప్పదు. ఇక ఎప్పటి లాగే జట్టులో మార్పులు ఏవీ ఉండక పోవచ్చని అంచనా. ఓపెనర్లు ధావన్, గిల్ ఫామ్ కొంత ఇబ్బందికరంగా మారంది. ధావన్ 4,13 పరుగులు మాత్రమే చేశాడు. గిల్ 28 రన్స్ తో నిరాశ పరిచాడు.
ఇషాన్ కిషన్ , శ్రేయస్ అయ్యర్ , సంజూ శాంసన్ పూర్తి ఫామ్ లో ఉన్నారు. ఇక వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ , షాబాజ్ అహ్మద్ , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్ , అవేష్ ఖాన్ ఆడనున్నారు.
Also Read : అయ్యర్ అయ్యారే కిషన్ భళారే